Share News

PM Modi Letter: దివంగత మాజీ ప్రధాని ఖలీదా జియా తనయుడికి పీఎం మోదీ లేఖ..

ABN , Publish Date - Jan 01 , 2026 | 08:31 AM

బంగ్లాదేశ్‌కు మూడుసార్లు ప్రధానిగా సేవలందించిన ఖలీదా జియా అనారోగ్య సమస్యల కారణంగా ఇటీవల తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోదీ ఆమె తనయుడికి సంతాప లేఖ రాశారు.

PM Modi Letter: దివంగత మాజీ ప్రధాని ఖలీదా జియా తనయుడికి పీఎం మోదీ లేఖ..
PM Modi Letter

ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్‌(Bangladesh) మాజీ ప్రధాని ఖలీదా జియా(Khaleda Zia) 2026 డిసెంబర్ 30న కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు లక్షలాది మంది అశ్రునయనాల మధ్య బుధవారం జరిగాయి. ఈ సందర్భంగా భారత్(India) పొరుగు దేశం పట్ల ఉన్న గౌరవాన్ని చాటుకుంది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారీఖ్ రెహమాన్‌(Tariq Rahman)కు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)సంతాప లేఖ రాశారు. ఈ లేఖను భారత విదేశాంగ మంత్రి (Indian Foreign Minister) ఎస్.జైశంకర్(S. Jaishankar)ద్వారా అందజేశారు.


ఢాకా చేరుకున్న జైశంకర్ స్వయంగా ప్రధాని సంతాప లేఖను తారీఖ్ రెహ్మాన్‌కు అందజేశారు. మోదీ లేఖలో.. ‘ఖలీదా జియా మరణం బంగ్లాదేశ్ ప్రజలకు తీరని లోటు. ఆమె దార్శనికత, విలువలు భారత్ - బంగ్లా భాగస్వామ్యాన్ని ముందుకు నడిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 2015లో ఢాకా పర్యటనలో ఖలీదాతో జరిగిన సమావేశం, చర్చలను ఎప్పటికీ మర్చిపోలేను. ఆమె గొప్ప సంకల్పం, ధృడ నిశ్చయం కలిగిన నాయకురాలు, బంగ్లాదేశ్ మొదటి మహిళా ప్రధానమంత్రిగా ఘనత పొందారు. ఇరుదేశా సంబంధాల బలోపేతానికి ఎంతో కృషి చేశారు’ అని తన రాశారు.

ఒక విపక్ష నేత కుటుంబానికి భారత్ ఇచ్చిన గౌరవం, మర్యాద ఎంతో గొప్పగా ఉందని అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో చర్చించుకుంటున్నారు.


ఇవి కూడా చదవండి...

భారీ ఉగ్రకుట్ర భగ్నం.. 150 కేజీల అమ్మోనియం నైట్రేట్ స్వాధీనం

అయోధ్యలో ప్రాణ్ ప్రతిష్ట ద్వితీయ వార్షికోత్సవం.. ఆలయంపై రాజ్‌నాథ్ పతాకావిష్కరణ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 01 , 2026 | 08:54 AM