Share News

రష్యాలో భారీ భూకంపం.. రిక్టర్‌ స్కేల్‌పై 7.0 తీవ్రత నమోదు..

ABN , Publish Date - Oct 16 , 2026 | 10:41 AM

రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 7.0గా నమోదైనట్లు యూరోపియన్‌-మెడిటరేనియన్‌ సీస్మోలాజికల్‌ సెంటర్‌ వెల్లడించింది.

రష్యాలో భారీ భూకంపం.. రిక్టర్‌ స్కేల్‌పై 7.0 తీవ్రత నమోదు..
Russia Earthquake

మాస్కో: రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 7.0గా నమోదైనట్లు యూరోపియన్‌-మెడిటరేనియన్‌ సీస్మోలాజికల్‌ సెంటర్‌ (EMSC) వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం సుమారు 3:35 గంటలకు ఇది ఏర్పడింది. ఫార్‌ ఈస్ట్‌ ప్రాంతంలోని విల్యూచిన్స్క్‌ నగరానికి నైరుతి దిశగా సుమారు 123 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు ఈఎమ్ఎస్‌సీ తెలిపింది. భూమికి సుమారు 140 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు పేర్కొంది.


పసిఫిక్‌ మహాసముద్రం చుట్టూ విస్తరించిన ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’ ప్రాంతంలో కమ్చట్కా ద్వీపకల్పం ఉంది. ఇక్కడ టెక్టానిక్‌ పలకల కదలికల కారణంగా తరచూ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవిస్తుంటాయి. 2025 జులైలోనూ ఈ ప్రాంత తీరానికి సమీపంలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించి సునామీకి కారణమైంది. కాగా, తాజా భూకంపానికి సంభవించి ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు అధికారికంగా వెలువడలేదు. అలాగే, సునామీ హెచ్చరికలు జారీ చేశారా, లేదా? అన్న దానిపైనా స్పష్టత రావాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి

అమెరికా ఒరెగాన్‌లో పాఠశాలపై కాల్పులు.. ఐదుగురు మృతి..!

యూదులను కాల్చి చంపాలనుంది.. హమాస్ మాజీ చీఫ్ కుమారుడి లేఖ..

Updated Date - Oct 16 , 2026 | 11:06 AM