'నేనొక పనికిరాని వెధవను'.. తనను తాను తిట్టుకున్న జెన్సన్ హువాంగ్..
ABN , Publish Date - Nov 13 , 2026 | 11:49 AM
ప్రపంచాన్ని ఏఐ చిప్స్‌తో శాసించిన టెక్ దిగ్గజం ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో తలెత్తిన వివాదాలతో కుప్పకూలిపోయారు. ఒకప్పుడు ఆత్మవిశ్వాసానికి మారుపేరుగా నిలిచిన జెన్సన్ హువాంగ్.. ఇప్పుడు తనను తానే ‘నేనొక పనికిరాని వెధవను’ అంటూ తిట్టుకుంటున్నారట.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచాన్ని ఏఐ చిప్స్‌తో శాసించిన టెక్ దిగ్గజం ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో తలెత్తిన వివాదాలతో కుప్పకూలిపోయారు. ఒకప్పుడు ఆత్మవిశ్వాసానికి మారుపేరుగా నిలిచిన జెన్సన్ హువాంగ్.. ఇప్పుడు తనను తానే ‘నేనొక పనికిరాని వెధవను’ అంటూ తిట్టుకుంటున్నారట. ఎన్విడియా సీఈఓగా ఆయన చివరి గంటలు తీవ్ర మానసిక వేదన మధ్య గడిచినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
దశాబ్దాల కష్టంతో ఎన్విడియాను లక్షల కోట్ల డాలర్ల విలువైన సంస్థగా తీర్చిదిద్దిన హువాంగ్.. ప్రపంచ ఏఐ రంగంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా ఎదిగారు. సంస్థలో ప్రతి చిన్న విషయాన్ని పర్యవేక్షించే ఆయనకు సుమారు 60 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు నేరుగా రిపోర్ట్ చేసేవారు. ఉద్యోగుల పనితీరుపైనా నిరంతరం దృష్టి పెట్టేవారు. అయితే, వివాహేతర సంబంధాల ఆరోపణలు ఆయన ప్రతిష్ఠను తీవ్రంగా దెబ్బతీశాయి. చైనా గూఢచారిగా అనుమానిస్తున్న మహిళతో ఆయనకు ఉన్న సంబంధాలు కలకలం రేపాయి. తొలుత ఆ ఆరోపణలను ఖండించిన హువాంగ్.. నవంబర్ 8న సంస్థ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో వివాహేతర సంబంధాన్ని అంగీకరించి, కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. విచారణకు సహకరిస్తాననీ ప్రకటించారు.
తాజాగా మరో వివాహేతర సంబంధంపై వార్తలు రావడంతో ఎన్విడియా బోర్డు అత్యవసరంగా సమావేశమైంది. చివరకు ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. కాగా, ప్రస్తుతం సీఎఫ్ఓ కొలెట్ క్రెస్ తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. సీఈఓగా చివరి గంటల్లో తనను తాను ‘పీస్ ఆఫ్ షిట్’ అంటూ హువాంగ్ తీవ్రంగా నిందించుకున్నారట. అలాగే, గతంలో ఎప్పుడూ కనిపించని విధంగా ‘ఏదైతే అదవుతుంది’, ‘నేను దేనినీ పట్టించుకోను’ అంటూ ఆయన మాట్లాడటం ప్రారంభించారని మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీంతో ఒకప్పుడు ప్రపంచాన్ని నడిపించే టెక్ దిగ్గజంగా కనిపించిన వ్యక్తి.. తన వ్యక్తిగత జీవితంలోని పరిణామాలతో ఎంతగా కుంగిపోయారో ఈ వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయనే చర్చ జరుగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి
మైక్రోసాఫ్ట్ సేవలకు అంతరాయం.. నిలిచిపోయిన ఔట్లుక్, టీమ్స్..
మూడోసారి వివాహేతర సంబంధాల వివాదంలో ఎన్విడియా మాజీ సీఈఓ