అమెరికాకు షాకిచ్చిన ఇరాన్.. అత్యాధునిక జలాంతర్గామి స్వాధీనం!
ABN , Publish Date - Sep 27 , 2026 | 08:19 PM
హోర్ముజ్ జలసంధిలో నిఘా పెడుతున్న అమెరికా రక్షణ రంగానికి చెందిన 'Remus 600' అనే అత్యాధునిక మానవరహిత జలఅంతర్గామిని తాము స్వాధీనం చేసుకున్నట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది.
టెహ్రాన్, సెప్టెంబర్ 27: స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ జలసంధిలో నిఘా పెడుతున్న అమెరికా రక్షణ రంగానికి చెందిన 'Remus 600' అనే అత్యాధునిక మానవరహిత జలఅంతర్గామిని తాము స్వాధీనం చేసుకున్నామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది.
ఇరాన్ ఆర్మీ తమ నిఘా వర్గాలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సామర్థ్యాలతో ఒక సంక్లిష్టమైన ఆపరేషన్ చేపట్టి, గూఢచర్యం చేస్తున్న ఈ సబ్‌మర్సిబుల్‌ను పట్టుకున్నామని, ప్రయోగశాలల్లో దాని డేటాను విశ్లేషిస్తున్నామని తెలిపింది. హోర్ముజ్ జలసంధి మార్గం మూసివేసి ఉందని, తమ అనుమతి లేకుండా, నిర్దేశించిన మార్గంలో కాకుండా ప్రయాణించే ఏ నౌకలకూ భద్రత ఉండదని ఇరాన్ దళాలు స్పష్టం చేశాయి.
కాగా, అమెరికా విధించిన ఆంక్షలు, నావికా దిగ్బంధనం తొలగిస్తే స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ తెరుస్తామని, 7 రోజుల కాల్పుల విరమణకు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రతిపాదించగా, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆ ప్రతిపాదనను తిరస్కరించారు.
అమెరికా అధ్యక్షుడు సీజ్‌ఫైర్‌ను తిరస్కరించిన నేపథ్యంలో, ఇరాన్ ఆర్మీ సీనియర్ అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ అబోల్ఫజల్ షేకర్చి మాట్లాడుతూ, శత్రువుల ముందు వెనకడుగు వేసేది లేదని, తమ భూభాగంలో అమెరికా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
రాహుల్ ఆరోపణలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
భూ సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం: మంత్రి పొంగులేటి