Share News

మిషిగన్‌ హౌస్‌ స్పీకర్‌గా రంజీవ్‌ పురి

ABN , Publish Date - Nov 07 , 2026 | 05:55 AM

అమెరికా రాజకీయాల్లో భారత సంతతి ప్రతినిధి మరో అరుదైన మైలురాయిని అధిగమించారు.

మిషిగన్‌ హౌస్‌ స్పీకర్‌గా రంజీవ్‌ పురి
ranjiv

వాషింగ్టన్‌, నవంబరు 6: అమెరికా రాజకీయాల్లో భారత సంతతి ప్రతినిధి మరో అరుదైన మైలురాయిని అధిగమించారు. డెమొక్రటిక్‌ పార్టీ నాయకుడు రంజీవ్‌ పురి(42) మిషిగన్‌ ప్రతినిధుల సభ నూతన స్పీకర్‌గా ఎన్నికయ్యారు. యూస్‌ మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్లు ఘనవిజయం సాధించి మిషిగన్‌ హౌస్‌లో మెజారిటీ సొంతం చేసుకున్న తర్వాత, గురువారం జరిగిన పార్టీ అంతర్గత ఓటింగ్‌లో ఆయన స్పీకరుగా ఎన్నికయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ అమెరికన్‌గా రంజీవ్‌ పురి చరిత్ర సృష్టించారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం ట్రంప్‌ ప్రభుత్వంలో పౌర హక్కుల విభాగం చీఫ్‌గా పనిచేస్తున్న భారత సంతతి అధికారిణి హర్మీత్‌ కౌర్‌ ధిల్లాన్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత ట్రంప్‌ యంత్రాంగం నుంచి వైదొలిగిన తొలి ఉన్నతాధికారిగా హర్మీత్‌ కౌర్‌ నిలిచారు.

ఇవి కూాడా చదవండి...

శాటిలైట్లకు చిక్కకుండా పంట వ్యర్థాల దహనం.. ‘ఫైర్ వాచ్‌’తో సమస్యకు చెక్

ఓబీసీ క్రీమీలేయర్‌పై సుప్రీంకోర్టు కీలక స్పష్టత.

Updated Date - Nov 07 , 2026 | 05:56 AM