Share News

హైవేపై బర్త్‌డే హంగామా.. కార్లపై స్టంట్లు చేసిన 8 మంది అరెస్ట్!

ABN , Publish Date - Oct 30 , 2026 | 05:54 PM

ఓ జాతీయ రహదారపై యువకులు అత్యుత్సాహం ప్రదర్శించి చివరకు కటకలపాలయ్యారు. బర్త్‌డే వేడుకల పేరుతో రద్దీగా ఉండే జాతీయ రహదారిపై (NH-9) నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రమాదకర స్టంట్లు చేశారు.

హైవేపై బర్త్‌డే హంగామా.. కార్లపై స్టంట్లు చేసిన 8 మంది అరెస్ట్!
Birthday stunts

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాపూర్‌లోని జాతీయ రహదారపై యువకులు అత్యుత్సాహం ప్రదర్శించి చివరకు కటకలపాలయ్యారు. బర్త్‌డే వేడుకల పేరుతో రద్దీగా ఉండే జాతీయ రహదారిపై (NH-9) నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రమాదకర స్టంట్లు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..


హాపూర్‌లోని జాతీయ రహదారిపై తన పుట్టినరోజు వేడుకను ఘనంగా జరుపుకోవాలని ఓ యువకుడు భావించాడు. ఈ క్రమంలో రాజా కీ హవేలీ హోటల్ సమీపంలో హైవేపై అతడి స్నేహితులు కారు బోనెట్‌పై ఏకంగా ఐదు కేక్‌లను ఏర్పాటు చేశారు. సదరు యువకుడు అందరూ చూస్తుండగా కత్తితో ఆ కేక్‌లను కట్ చేశాడు. చుట్టూ ఉన్న స్నేహితులు కేకలు వేస్తూ, పార్టీ పాపర్లు పేల్చుతూ నానా హంగామా సృష్టించారు.


అంతటితో ఆగకుండా.. కేక్ కటింగ్ తర్వాత కదులుతున్న కార్ల నుంచి బయటికి వేలాడుతూ, బైక్‌లపై ప్రమాదకరమైన స్టంట్లు చేస్తూ రచ్చ చేశారు. దీంతో అటుగా వెళ్తున్న ఇతర ప్రయాణికులకు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. రద్దీగా ఉండే హైవేపై ఈ స్టంట్స్ ప్రాణాల మీదకు తెచ్చేలా ఉన్నాయంటూ నెటిజన్లు ఆ వీడియోలను షేర్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాబుగఢ్ పోలీసులు వెంటనే స్పందించారు. అక్టోబర్ 29న ఈ ఉదంతం తమ దృష్టికి వచ్చిందని హాపూర్ ఎస్పీ తెలిపారు. నిందితుల ఆచూకీ గుర్తించి మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. వేడుకలకు ఉపయోగించిన కారుతో పాటు బైక్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తే ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి

బద్రీనాథ్ నుంచి తిరిగి వస్తుండగా గల్లంతైన హెలికాప్టర్

అలాంటి శారీరక సంబంధం అత్యాచారం కాదు: సుప్రీంకోర్టు కీలక తీర్పు

Updated Date - Oct 30 , 2026 | 06:05 PM