Donald Trump: అలా చేస్తే పెద్ద సమస్యే.. గ్రీన్‌లాండ్‌కు ట్రంప్ మరోసారి వార్నింగ్..
ABN , Publish Date - Jan 14 , 2026 | 01:05 PM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. గ్రీన్‌లాండ్ విలీనం కోసం నిరంతరం బెదిరింపులకు పాల్పడుతున్నారు. గ్రీన్‌లాండ్.. అమెరికాలో చేరడానికి నిరాకరిస్తోంది. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. గ్రీన్‌లాండ్ నిర్ణయం పెద్ద సమస్య సృష్టిస్తోందంటూ పరోక్ష వార్నింగ్ ఇచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: వెనెజువెలాలో ప్రభుత్వాన్ని గద్దెదింపిన అమెరికా ప్రభుత్వం.. ఇప్పుడు గ్రీన్‌లాండ్‌పై ఫోకస్ పెట్టింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. గ్రీన్‌లాండ్(Greenland) విలీనం కోసం నిరంతర బెదిరింపులకు పాల్పడుతున్నారు. మరోవైపు గ్రీన్‌లాండ్ అమెరికాలో చేరడానికి నిరాకరిస్తోంది. ఈ ఆర్కిటిక్ భూభాగం డెన్మార్క్ యూనియన్‌లో ఉండటానికే ప్రాధాన్యం ఇస్తోందని.. గ్రీన్‌లాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడెరిక్ నీల్సన్(Nielsen) స్పష్టం చేశారు. యూఎస్ఏ, డెన్మార్క్‌లలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోమంటే.. తాము డెన్మార్క్‌నే సెలెక్ట్ చేసుకుంటామని నీల్సన్ తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రీన్‌లాండ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. నీల్సన్ తీసుకున్న నిర్ణయం పెద్ద సమస్యను క్రియేట్ చేస్తోందంటూ ఆయన హెచ్చరించారు.
కోపెన్‌హగెన్‌లో గ్రీన్‌లాండ్ ప్రధాని నీల్సన్, డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడెరిక్సెన్(Denmark Greenland relations) సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. 'మేము ఇప్పుడు భౌగోళిక, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాము. మేము యునైటెడ్ స్టేట్స్, డెన్మార్క్ రెండింటిలో ఒకటి ఎంచుకోవలసి వస్తే.. మేము డెన్మార్క్‌ను ఎంచుకుంటాం. ప్రస్తుతం స్వతంత్రంగా ఉంటూనే డెన్మార్క్‌లో భాగంగా ఉన్న గ్రీన్‌లాండ్ గురించి మన అందరికీ తెలుసు' అని నీల్సన్ అన్నారు. బుధవారం వాషింగ్టన్‌లో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో డానిష్, గ్రీన్‌లాండ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరగడానికి ముందు గ్రీన్‌లాండ్ ప్రధాని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం.. గ్రీన్‌లాండ్ పరిస్థితి చాలా ప్రమాదంలో ఉందని, ఈ ద్వీపాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్ వైపు నుంచి బెదిరింపులు వస్తున్నాయని నీల్సన్ చెప్పారు.
ట్రంప్ బెదిరింపులు
గ్రీన్‌లాండ్ ప్రధాని నీల్సన్ వ్యాఖ్యల గురించి మీడియా అడగ్గా.. ట్రంప్ సూటిగా స్పందించారు. డెన్మార్క్‌ను ఎంపిక చేసుకోవడం.. రాబోయే కాలంలో వారికి పెద్ద సమస్యను సృష్టించే అవకాశముందని ఆయన పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. గ్రీన్‌లాండ్‌లో పరిస్థితులు వారి సమస్యలేనని, వారితో తాను ఏకీభవించనని ట్రంప్(Trump foreign policy threats) అన్నారు. నీల్సన్ ఎవరో తనకు తెలియదని, అతడి నిర్ణయం మాత్రం ఓ పెద్ద సమస్య కాబోతోందని ట్రంప్ అన్నారు. ఆర్థిక మార్గాల ద్వారా లేదా సైనిక శక్తి ద్వారా గ్రీన్‌లాండ్‌ను నియంత్రించాలని అమెరికా అధ్యక్షుడు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
చైనా-పాక్ ఒప్పందం చెల్లదు.. ఆ వ్యాలీ భారత్‌కు ఎందుకు కీలకం..
రైలుపై కూలిన క్రేన్.. 22 మంది మృతి