Share News

Lawrence Bishnoi: అమెరికాలో గ్యాంగ్ వార్‌.. కాల్పుల్లో లారెన్స్ బిష్ణోయ్ అనుచరుడి హతం

ABN , Publish Date - Jan 12 , 2026 | 04:49 PM

లారెన్స్ బిష్ణోయ్ ముఠాపై కాల్పులకు తామే బాధ్యులమని రోహిత్ గోడారా గ్యాంగ్ ప్రకటించింది. తమ గ్యాంగ్‌కు చెందిన బల్జోత్ సింగ్, జస్సా ఈ దారి జరిపినట్టు ఫేస్‌బుక్ పోస్టులో తెలిపింది.

Lawrence Bishnoi: అమెరికాలో గ్యాంగ్ వార్‌.. కాల్పుల్లో లారెన్స్ బిష్ణోయ్ అనుచరుడి హతం
Virender Sambhi

వాషింగ్టన్: అమెరికా (USA)లోని ఇండియానా (Indiana state)లో గ్యాంగ్ వార్ చోటుచేసుకుంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అనుచరుడిని ప్రత్యర్థి ముఠా సభ్యులు కాల్చిచంపారు. మరో వ్యక్తి గాయపడ్డాడు. మృతిచెందిన వ్యక్తిని హర్యానా నివాసి వీరేందర్ సంభి (Virender Sambi)గా గుర్తించారు.


కాగా, లారెన్స్ బిష్ణోయ్ ముఠాపై కాల్పులకు తామే బాధ్యులమని రోహిత్ గోడారా గ్యాంగ్ ప్రకటించింది. తమ గ్యాంగ్‌కు చెందిన బల్జోత్ సింగ్, జస్సా ఈ దారి జరిపినట్టు ఫేస్‌బుక్ పోస్టులో తెలిపింది. లారెన్స్ బిష్ణోయ్ 'ద్రోహి' అని, అతన్ని తాము హెచ్చరిస్తున్నామని, తామిచ్చే సర్‌ప్రైజ్‌ కోసం వేచి చూడాలని బల్జోత్ సింగ్ ఆ పోస్టులో పేర్కొన్నాడు. కాగా, ముఠా కాల్పుల్లో వీరేందర్ సంభి హతమైన ఘటనపై అమెరికా అధికారులు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.


రోహిత్ గోడారా గ్యాంగ్

రోహిత్ గోడారా రాజస్థాన్‌లోని బికనెర్ నివాసి. గతంలో లారెన్స్ బిష్ణోయ్‌తో సన్నిహత సంబంధాలు నెరిపాడు. బిష్ణోయ్-గోల్టీ బ్రార్ క్రిమినల్ నెట్‌వర్క్‌లో భాగంగా పనిచేసేవాడు. అయితే ఆ తర్వాత అతను సొంత నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. కెనడా, అజర్‌బైజాన్ వంటి పలు దేశాల నుంచి తన క్రిమినల్ ఆపరేషన్లు నడుపుతున్నాడు. బెదిరించి డబ్బులు వసూలు చేయడం, టార్గెట్ హత్యలు, ఆయుధాల స్మగ్లింగ్‌లో రోహిత్ గోడారా గ్యాంగ్‌కు ప్రమేయం ఉంది. గత ఏడాది నవంబర్‌లో 'ఆపరేషన్ ట్రాక్‌డ్రౌన్'లో భాగంగా హర్యానా పోలీసులు గురుగావ్‌లో రోహిత్ గోడారా ముఠాకు చెందిన నరేష్ కుమార్, సంజయ్ అలియాస్ సంజీవ్ అనే ఇద్దర్ని అరెస్టు చేశారు. వీరిపై రివార్డు ఉందని, సంజయ్‌పై 10 క్రిమినల్ కేసులు, నరేష్‌పై 4 క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. హత్యాయత్నం, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండటం వంటి కేసులు వీరిపై ఉన్నట్టు చెప్పారు.


ఇవి కూడా చదవండి..

వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిగా ట్రంప్.. వైరల్‌గా మారిన పోస్ట్..

ఒకళ్లూ.. ఇద్దరూ కాదు.. వేలాది మంది!

Updated Date - Jan 12 , 2026 | 05:30 PM