Share News

Trump Iran negotiation: అమెరికా చేతిలో దెబ్బలు.. దిగొచ్చిన ఇరాన్‌.. ట్రంప్‌‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

ABN , Publish Date - Jan 12 , 2026 | 12:18 PM

అంతర్గత తిరుగుబాటుతో సతమతమవుతున్న ఇరాన్‌ నాయకత్వం దిగొచ్చినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యకు సిద్ధమవుతోందని వార్తలు వస్తున్న వేళ ఆ దేశ నాయకులు తనకు ఫోన్ చేశారని ట్రంప్ పేర్కొన్నారు.

Trump Iran negotiation: అమెరికా చేతిలో దెబ్బలు.. దిగొచ్చిన ఇరాన్‌.. ట్రంప్‌‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
Trump Iran negotiation news

అంతర్గత తిరుగుబాటుతో సతమతమవుతున్న ఇరాన్‌ నాయకత్వం దిగొచ్చినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యకు సిద్ధమవుతోందని వార్తలు వస్తున్న వేళ ఆ దేశ నాయకులు తనకు ఫోన్ చేశారని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా చేతిలో దెబ్బలు తిని ఇరాన్‌ నేతలకు విసుగు వచ్చి ఉంటుందని, అందుకే వెనక్కి తగ్గారని ట్రంప్ ఎద్దేవా చేశారు. త్వరలోనే ఇరాన్ నాయకులతో సమావేశం అయ్యే అవకాశం ఉందని తెలిపారు (US Iran talks protests).


'ఇరాన్ నాయకులు నిన్న నాకు ఫోన్ చేశారు. మాతో వారు చర్చలు జరపాలనుకుంటున్నారు. అక్కడి నాయకులు పరిమితులు దాటి హింసతోనే దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఆ దేశ పరిస్థితిని మేం నిశితంగా గమనిస్తున్నాం. సమస్య పరిష్కారం కోసం అందుబాటులో ఉన్న బలమైన ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నాం. ఇరాన్ నాయకులను కలవడానికి ముందే మేం చర్యలు తీసుకోవాల్సి రావొచ్చు. ఏదేమైనా ఇరాన్ నాయకులతో ఒక సమావేశం మాత్రం ఉంటుంది' అని ట్రంప్ స్పష్టం చేశారు (Iran protests crackdown).


అలాగే ఇరాన్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడం గురించి కూడా ట్రంప్ స్పందించారు (Iran US diplomatic tensions). శాటిలైట్ ద్వారా ఇరాన్‌లో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించడం గురించి స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్‌తో మాట్లాడాలనుకుంటున్నట్టు తెలిపారు. కాగా, ఇరాన్‌లో జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటివరకు 544 మంది వరకు చనిపోయినట్టు సమాచారం. వీరిలో 48 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. ఇప్పటివరకు 10 వేల మందికి పైగా నిరసనకారులను ఇరాన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది.


ఇవి కూడా చదవండి..

ఇంటి ఖర్చుల లెక్కలు అడిగిన భర్తపై కేసు.. సుప్రీం కోర్టు తీర్పు ఏంటంటే..


మూడు పాములతో హాస్పిటల్‌కు.. అసలేం జరిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే..

Updated Date - Jan 12 , 2026 | 12:33 PM