Masood Azhar: ఒకళ్లూ.. ఇద్దరూ కాదు.. వేలాది మంది!
ABN , Publish Date - Jan 12 , 2026 | 07:25 AM
భారత్‌పై ఏ క్షణంలో అయినా దాడి చేయడానికి భారీ ఆత్మాహుతి దళం సిద్ధంగా ఉందని జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ చెప్పాడు.
ఆత్మాహుతి బాంబర్లు భారత్‌పై దాడి కోసం సిద్ధంగా ఉన్నారు: మసూద్ అజార్
న్యూఢిల్లీ, జనవరి 11: భారత్‌పై ఏ క్షణంలో అయినా దాడి చేయడానికి భారీ ఆత్మాహుతి దళం సిద్ధంగా ఉందని జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ చెప్పాడు. ఆయన మాట్లాడినట్లుగా భావిస్తున్న ఒక ఆడియో క్లిప్ తాజాగా వెలుగులోకి వచ్చింది. తమవద్ద వెయ్యి మందికి పైగా ఆత్మాహుతి బాంబర్లు సిద్ధంగా ఉన్నారని, భారత్‌లో చొరబడటానికి అనుమతి ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారని అందులో చెప్పాడు. ఆ బృందంలో ఎందరుఉన్నారో చెబితే ప్రపంచాన్నే దిగ్ర్భాంతికి గురిచేస్తుందని అజార్ ప్రగల్భాలు పలికాడు. ‘‘ఆ ఆత్మాహుతి బాంబర్లు ఒక్కరో.. ఇద్దరో.. వంద మందో కాదు.. వెయ్యి మంది కూడా కాదు... నేను మీకు పూర్తి సంఖ్యను చెబితే.. రేపు ప్రపంచ మీడియాలో పెద్ద కలకలం రేగుతుంది’’ అని వ్యాఖ్యానించాడు.