President Of Venezuela: వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిగా ట్రంప్.. వైరల్‌గా మారిన పోస్ట్..
ABN , Publish Date - Jan 12 , 2026 | 09:56 AM
మదురోను అమెరికా నిర్భంధించిన తర్వాత డెల్సీ రోడ్రిగ్జ్ వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. డెల్సీ రోడ్రిగ్జ్‌కు అమెరికా కూడా మద్దతు ఇచ్చినట్లు సమాచారం. ఇలాంటి సమయంలో ట్రంప్ ఈ పోస్టు పెట్టడం చర్చకు దారి తీసింది..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ‘ది ట్రూత్’లో షేర్ చేసిన ఓ ఫొటో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ వికీపీడియాకు సంబంధించిన ఫొటో అది. వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడు ట్రంప్ అని అందులో ఉంది. జనవరి 2026లో ఆయన బాధ్యతలు తీసుకున్నట్లుగా ఉంది. అయితే, మదురోను అమెరికా నిర్భంధించిన తర్వాత డెల్సీ రోడ్రిగ్జ్ వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. డెల్సీ రోడ్రిగ్జ్‌కు అమెరికా కూడా మద్దతు ఇచ్చినట్లు సమాచారం. ఇలాంటి సమయంలో ట్రంప్ ఈ పోస్టు పెట్టడం చర్చకు దారి తీసింది.
అమెరికా మారణహోమం..
వెనెజువెలాపై సైనిక చర్య తప్పదని గత కొంత కాలంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా డెల్టా ఫోర్స్ సైన్యం జనవరి 3వ తేదీన వెనెజువెలాపై దాడి చేసి మదురోను, ఆయన భార్యను కస్టడీలోకి తీసుకుంది. అమెరికా సైన్యం దాడుల్లో పెద్ద మొత్తంలో వెనెజువెలా, క్యూబన్ సైనికులు చనిపోయారు. వెనెజువెలా స్థానిక మీడియా కథనాల ప్రకారం.. అమెరికా దాడుల్లో 32 మంది క్యూబన్, 23 మంది వెనెజువెలా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో 26 నుంచి 67 సంవత్సరాల వారు ఉన్నారు. ఇద్దరు కల్నల్స్, ఒక లెఫ్టినెంట్ కల్నల్ ఉన్నారు. చనిపోయిన క్యూబన్స్‌లో మదురో సెక్యూరిటీకి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు.
క్యూబాకు హెచ్చరిక..
మదురోను అపహరించడాన్ని క్యూబా అధ్యక్షుడు మిగ్వెల్ డియాజ్ కనెల్ తీవ్రంగా తప్పుబట్టారు. అమెరికా తమ జోలికి వస్తే పరిస్థితి వేరేలా ఉంటుందని హెచ్చరించారు. క్యూబా అధ్యక్షుడి వ్యాఖ్యలపై ట్రంప్ ఫైర్ అయ్యారు. శనివారం క్యూబాకు అల్టిమేటం జారీ చేశారు. వైరం పక్కన పెట్టి రాజీకి రాకపోతే సైనిక చర్య తప్పదని హెచ్చరించారు. ఈ మేరకు తన ట్రూత్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘వెనెజువెలా చమురు, నిధుల పైనే క్యూబా ఆధారపడి జీవిస్తోంది. ఇకపై వెనెజువెలా నుంచి క్యూబాకు చమురు, నిధులు అందవు. పరిస్థితి చేయి దాటకముందే రాజీకి రావటం ఉత్తమం’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
ఆ అవార్డులన్నీ మా అమ్మకి పంపిస్తా.. విరాట్ కోహ్లీ ఎమోషనల్
హనుమకొండ జిల్లాలో దారుణం.. భారీగా కుక్కల హతం