Share News

‘ఎంఆర్‌ఎన్‌ఏ ఫ్లూ వ్యాక్సిన్‌’కు ఎఫ్‌డీఏ అనుమతి

ABN , Publish Date - Aug 07 , 2026 | 05:56 AM

యాభై నుంచి అరవైనాలుగేళ్ల మధ్య వయసున్నవారి కోసం మోడెర్నా సంస్థ రూపొందించిన సరికొత్త ‘ఎంఆర్‌ఎన్‌ఏ ఫ్లూ వ్యాక్సిన్‌’ ‘ఎంఫ్లూసివా’కు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ...

‘ఎంఆర్‌ఎన్‌ఏ ఫ్లూ వ్యాక్సిన్‌’కు ఎఫ్‌డీఏ అనుమతి

  • 50-64 ఏళ్ల వారి కోసం ‘ఎంఫ్లూసివా’ను

  • తయారుచేసిన మోడెర్నా సంస్థ

న్యూయార్క్‌, ఆగస్టు 6: యాభై నుంచి అరవైనాలుగేళ్ల మధ్య వయసున్నవారి కోసం మోడెర్నా సంస్థ రూపొందించిన సరికొత్త ‘ఎంఆర్‌ఎన్‌ఏ ఫ్లూ వ్యాక్సిన్‌’ ‘ఎంఫ్లూసివా’కు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ ఎఫ్‌డీఏ) ఆమోదం తెలిపింది. అయితే, 50-64 ఏళ్ల మధ్య వయసున్న 40 వేల మందిపై చేసిన ట్రయల్స్‌ తాలూకూ డేటా ఆధారం గా ఆ వయసు వారి వినియోగానికి మాత్రమే పూర్తి అనుమతి ఇచ్చింది. 65 ఏళ్లు పైబడినవారి వినియోగానికి కూడా అనుమతి ఇచ్చిందిగానీ.. అది ‘యాక్సిలరేటెడ్‌ అప్రూవల్‌’ మాత్రమే. అంటే, నిబంధనల ప్రకారం ఆ వయసువారిపై ఈ టీకా ప్రభావం గురించి మోడెర్నా సంస్థ మరోసమగ్రమైన అధ్యయనం నిర్వహించి, ఆ ఫలితాలను యూఎ్‌సఎ్‌ఫడీఏకి సమర్పించాల్సి ఉంటుంది. అందుకు మోడెర్నా సంస్థ అంగీకరించింది. ‘‘ఫ్లూ ఇప్పటికీ ఒక ప్రజారోగ్య సవాలుగానే ఉంది. ఈ క్రమంలో అమెరికాలో వృద్ధులకు మా ఎంఫ్లూవిసా ఒక కీలకమైన ప్రత్యామ్నాయంగా అందుబాటులోకి రానుంది’’ అని మోడెర్నా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రామాణిక ఫ్లూ టీకాల కన్నా తమ టీకా.. ట్రయల్స్‌లో 26.6% అధిక ప్రభావం చూపినట్టు వెల్లడించింది.

వార్తలు కూడా చదవండి...

కేంద్రమంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ

కల్తీ మసాలాలపై చర్యలు.. అంతర్రాష్ట్ర ముఠాలపై సిట్ ఫోకస్

క్షుద్రపూజలు చేయలేదని హరీశ్‌రావు ప్రమాణం చేసి చెప్పగలుగుతారా..?: అద్దంకి ద‌యాక‌ర్

Read Latest Telangana News And AP News And National News

Updated Date - Aug 07 , 2026 | 05:56 AM