టెహ్రాన్‌లో భారీ పేలుడు శబ్దం.. అసలు కారణం ఇదేనన్న ఇరాన్..
ABN , Publish Date - Jul 11 , 2026 | 01:46 PM
ఇరాన్ రాజధాని టెహ్రాన్ తూర్పు ప్రాంతంలో శనివారం భారీ పేలుడు శబ్దం వినిపించడంతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పాక్‌దష్త్, ఖియామ్‌దష్త్ ప్రాంతాల ప్రజలు ఈ పేలుడు శబ్దాలను విని దాడులు జరుగుతున్నట్టు భయపడ్డారు.
ఇరాన్ రాజధాని టెహ్రాన్ తూర్పు ప్రాంతంలో శనివారం భారీ పేలుడు శబ్దం వినిపించడంతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పాక్‌దష్త్, ఖియామ్‌దష్త్ ప్రాంతాల ప్రజలు ఈ పేలుడు శబ్దాలను విని దాడులు జరుగుతున్నట్టు భయపడ్డారు. అయితే కొద్దిసేపటికే ఇరాన్ ప్రభుత్వ మీడియా నుంచి స్పష్టత వచ్చింది (Tehran Explosion).
ఆ శబ్దాల గురించి ఇరాన్ ప్రభుత్వ మీడియా స్పందిస్తూ.. అది దాడి కాదని స్పష్టం చేసింది. యుద్ధం అనంతరం మిగిలిపోయిన మందుగుండు సామగ్రిని నియంత్రిత పద్ధతిలో నిర్వీర్యం చేస్తున్న సమయంలో జరిగిన పేలుడేనని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ వల్ల ప్రజలకు ఎలాంటి ప్రమాదమూ లేదని, ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు (Iran Explosion).
పేలుడు శబ్దం వినిపించిన వెంటనే దాని మూలం ఏమిటో స్పష్టత లేకపోవడంతో సామాజిక మాధ్యమాల్లో పలు ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి (Ammunition Disposal). ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ మొదలైన నేపథ్యంలో మరో దాడి జరిగిందేమోనని కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వడంతో ఆ సందేహాలకు తెరపడింది.
ఇవి కూడా చదవండి..
పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
ఇరాన్‌కు 24 గంటల గడువు.. హోర్ముజ్‌పై అమెరికా తుది హెచ్చరిక..