కుళ్లిన కోడిగుడ్లు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు.. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు..
ABN , Publish Date - Jul 11 , 2026 | 01:29 PM
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ ఏకంగా తొమ్మిది నోటీసులు జారీ చేసింది.
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) ఏకంగా తొమ్మిది నోటీసులు జారీ చేసింది. గడువు ముగిసిన ఆహార పదార్థాలు, కుళ్లిన గుడ్లు, పాడైన పాలు, కలుషిత శిశు ఆహారం, నాణ్యతలేని రెడీ-టు-ఈట్ పదార్థాలను వినియోగదారులకు సరఫరా చేశారంటూ వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్య తీసుకున్నట్లు నియంత్రణ సంస్థ తెలిపింది (Swiggy Instamart FSSAI Notice).
గడువు ముగిసిన వే ప్రోటీన్, కుళ్లిపోయి దుర్వాసన వస్తున్న సేంద్రియ గుడ్లు, పాడైన రెడీ-టు-ఈట్ ఆహారం, కలుషితమైన శిశు ఆహార ఉత్పత్తులు, పాడైన పాలు, దెబ్బతిన్న ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలు సరఫరా చేశారని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వచ్చినట్టు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తెలిపింది. కొన్ని సందర్భాల్లో ఫిర్యాదు చేసిన తర్వాత కూడా సరైన చర్యలు తీసుకోలేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేసినట్టు పేర్కొంది (Swiggy Expired Food).
ఈ ఫిర్యాదులపై సమగ్ర వివరణ ఇవ్వాలని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశించింది (Food Safety). భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకునే చర్యలపై పూర్తి నివేదిక సమర్పించాలని కోరింది. నిర్ణీత గడువులోగా సమాధానం ఇవ్వకపోతే ఆహార భద్రత చట్టం ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నోటీసుపై స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నుంచి ఇంకా అధికారిక స్పందన వెలువడలేదు.
ఇవి కూడా చదవండి..
పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
ఇరాన్‌కు 24 గంటల గడువు.. హోర్ముజ్‌పై అమెరికా తుది హెచ్చరిక..