Share News

శిక్షణలో నేర్చుకున్నది ఆచరించాడు.. పైలట్‌ మచ్చార్‌పై మాజీ కొలీగ్ ప్రశంసలు

ABN , Publish Date - Oct 03 , 2026 | 12:47 PM

కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై ప్రశంసలు జల్లులు కురుస్తూనే ఉన్నాయి. మచ్చార్ ధైర్యసాహసాలను తాజాగా ఆయన మాజీ కొలీగ్ టీనా గోస్వామి కొనియాడారు. పైలట్ శిక్షణలో నేర్చుకున్నదానిని కెప్టెన్ స్మిత్ మచార్ ఆచరించి చూపారని తెలిపారు. శనివారం ఓ టీవీ చానెల్‌తో టీనా మాట్లాడారు.

శిక్షణలో నేర్చుకున్నది ఆచరించాడు.. పైలట్‌ మచ్చార్‌పై మాజీ కొలీగ్ ప్రశంసలు

ఇంటర్‌నెట్ డెస్క్: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై ప్రశంసలు జల్లులు కురుస్తూనే ఉన్నాయి. మచ్చార్ ధైర్యసాహసాలను తాజాగా ఆయన మాజీ కొలీగ్ టీనా గోస్వామి కొనియాడారు. పైలట్ శిక్షణలో నేర్చుకున్నదానిని కెప్టెన్ స్మిత్ మచార్ ఆచరించి చూపారని తెలిపారు. శనివారం ఓ టీవీ చానెల్‌తో టీనా మాట్లాడారు. మచ్చార్ ట్రైన్డ్ పైలట్ మాత్రమే కాదని, మంచి వ్యక్తి అని కూడా ఆమె తెలిపారు. మచ్చార్ చాలా సాధారణంగా, వినయంగా ఉంటారని, ప్రతిఒక్కరినీ గౌరవిస్తారని ఆమె చెప్పారు. ‘‘ఆపదలో ఎలా వ్యవహరించాలో సాధారణంగా పైలట్ శిక్షణలో నేర్పుతారు. కానీ, నిజంగా ఆపద వచ్చినపుడు మనం ట్రైనింగ్‌లో నేర్చుకున్న విషయాన్ని ఆచరణలో పెట్టడం చాలా సవాలుతో కూడుకున్నది.


కాక్‌పిట్‌లో మచ్చార్‌పై కోపైలట్ దాడిచేసినపుడు ఆయన కంగారుపడకుండా సమయస్ఫూర్తిగా వ్యవహరించి 174 మందిని కాపాడారు. సాధారణంగా విమానంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా సిబ్బంది కలిసికట్టుగా ఎదుర్కొంటారు. కాక్‌పిట్‌లో ఒకరు విమానం నడుపుతుంటారు. మరొకరు ఫ్లైట్‌ను న్యావిగేట్ చేయడం, కమ్యూనికేట్ చేయడం వంటివి చేస్తుంటారు. కాక్‌పిట్‌లో ఏమైనా సమస్య వస్తే ఇద్దరూ ఎదుర్కొంటారు. కానీ, మచ్చార్ విషయంలో అలా జరగలేదు. దేవుడి దయ అనండి, సమయస్పూర్తి అనండి. ఒక్కడే సమస్యను ఎదుర్కొన్నారు. శిక్షణలో నేర్చుకున్న దానిని సరైన సమయంలో ఉపయోగించారు. మచ్చార్ చేసింది అద్భుతం’ అని టీనా వివరించారు.


ప్రయాణికుల సేఫ్టీకే ప్రాధాన్యం

స్మిత్ మచ్చార్‌ ఎప్పుడూ ప్రయాణికుల భద్రతకే ప్రాధాన్యం ఇస్తారని టీనా తెలిపారు. మచ్చార్‌తో కలిసి ప్రయాణించిన వారిని తాను పలకరించానని, వారు కూడా అదే విషయం చెప్పారని ఆమె వెల్లడించారు. ఆయన వైఖరి ఎప్పుడూ ప్రజలను కాపాడడమే అని చెప్పారు. కాగా.. మచ్చార్‌, టీనా స్పైస్‌జెట్‌లో సహోద్యోగులు.


ఇవీ చదవండి:

పర్వతాలు.. శిఖరాలు.. సరస్సులు.. లద్దాఖ్‌లో 28 ప్రాంతాలకు అధికారిక గుర్తింపు

ఏపీ మీదుగా మరో వందేభారత్‌ స్లీపర్‌‌.. హాల్ట్స్ ఇవే?

Updated Date - Oct 03 , 2026 | 01:29 PM