ఎవరెస్ట్‌పై భారీ స్కామ్.. బేకింగ్ సోడాతో డ్రామా..
ABN , Publish Date - Apr 02 , 2026 | 02:14 PM
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం అయిన మౌంట్ ఎవరెస్ట్‌పై జరుగుతున్నభారీ మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. నేపాల్‌కు చెందిన కొందరు గైడ్‌లు శిఖరంపైకి వెళ్లే వారిని మోసగించి కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ స్కాం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం అయిన మౌంట్ ఎవరెస్ట్‌పై జరుగుతున్నభారీ మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. నేపాల్‌కు చెందిన కొందరు గైడ్‌లు శిఖరంపైకి వెళ్లే వారిని మోసగించి కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ స్కామ్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. గైడ్‌లు, ట్రెక్కింగ్ సంస్థలు, హెలికాప్టర్ ఆపరేటర్లు, హాస్పిటల్ సిబ్బంది ఓ ముఠాగా ఏర్పడి విదేశీ పర్వతారోహకులను మోసం చేసి దాదాపు 20 మిలియన్ డాలర్ల (రూ.186 కోట్లు) కుంభకోణానికి పాల్పడినట్టు బయటపడింది (Everest rescue scam).
మొదట విదేశీ పర్వతారోహకులకు ఇచ్చే ఆహారంలో కావాలనే బేకింగ్ సోడా మోతాదును పెంచి, వారిని అస్వస్థతకు గురిచేస్తారు. బేకింగ్ సోడా ఎక్కువగా తీసుకోవడంతో వారికి జీర్ణకోశ సమస్యలు మొదలవుతాయి. ఎత్తు కారణంగానే అనారోగ్యం వచ్చిందని వారిని గైడ్‌లు నమ్మించి హెలికాప్టర్‌లను రప్పిస్తారు. అప్పటికే భయంతో ఉన్న పర్వతారోహకులు అడిగినంత డబ్బు ఇచ్చి హెలికాప్టర్లలో వచ్చి హాస్పిటల్‌లో జాయిన్ అవుతారు. అక్కడ నకిలీ వైద్యం చేసి పంపించేస్తారు (Nepal trekking fraud).
ఆ తర్వాత నకిలీ వైద్య పత్రాలు, తప్పుడు రిపోర్టులు, తారుమారు చేసిన ఫ్లైట్ డాక్యుమెంట్లతో అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి డబ్బులు క్లెయిమ్ చేస్తారు (Baking soda scam Everest). అలా వీరందరూ కలిసి ఇప్పటివరకు 20 మిలియన్ డాలర్ల స్కామ్ చేసినట్టు తాజాగా నేపాల్ పోలీసులు బయటపెట్టారు. హిమాలయ పర్వతాల్లో సహాయక కార్యక్రమాలు చేపట్టే సంస్థలకు చెందిన ఆరుగురు ఎగ్జిక్యూటివ్‌లను ఈ ఏడాది జనవరిలో పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారిస్తున్న సమయంలో ఈ స్కామ్ బయటపడింది. ఈ స్కామ్‌లో ప్రమేయం ఉన్న 32 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
ఇండోనేషియాను వణికించిన భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..