Share News

సూపర్ ఐడియా బాస్.. ఎల్పీజీ గ్యాస్ కొరత సమస్యకు ఎలా చెక్ పెట్టాడో చూడండి..

ABN , Publish Date - Apr 02 , 2026 | 01:20 PM

శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అనేది మన దేశ వాసులు బాగా నమ్మే సామెత. క్లిష్టమైన సమస్యకు సులభమైన పరిష్కారం కనిపెట్టడం మనవాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్ల కొరత వేధిస్తోంది.

సూపర్ ఐడియా బాస్.. ఎల్పీజీ గ్యాస్ కొరత సమస్యకు ఎలా చెక్ పెట్టాడో చూడండి..
waste engine oil stove

శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అనేది మన దేశ వాసులు బాగా నమ్మే సామెత. క్లిష్టమైన సమస్యకు సులభమైన పరిష్కారం కనిపెట్టడం మనవాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్ల కొరత వేధిస్తోంది. దీంతో చాలా హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. అయితే కొందరు తమ తెలివి ఉపయోగించి ఎల్పీజీలకు ప్రత్యామ్నాయాలను కనుగొంటున్నారు (Waste engine oil stove).


తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఒక జిలేబీ విక్రేత చేసిన వినూత్న ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎల్పీజీ గ్యాస్ కొరతను ఎదుర్కొనేందుకు అతను చేసిన ఈ జుగాడ్ చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన అమన్ గుప్తా అనే జిలేబీ విక్రేత, ఎల్పీజీ సిలిండర్ దొరక్కపోవడంతో తన దుకాణాన్ని కొన్ని రోజుల పాటు మూసివేయాల్సి వచ్చింది. దాదాపు నాలుగు రోజుల పాటు వ్యాపారం ఆగిపోవడంతో కొత్త మార్గం వెతకాలని నిర్ణయించుకున్నాడు (Prayagraj jalebi vendor).


వాడేసిన పాత ఇంజినాయిల్‌తో పని చేసే ఓ ప్రత్యేకమైన స్టవ్‌ను స్వంతంగా తయారు చేశాడు (Jugaad innovation). వాహనాల్లో ఉపయోగించిన తర్వాత పడేసే ఇంజినాయిల్‌తో ఈ స్టవ్ మండుతుంది. మంట కూడా ఎల్పీజీ సిలిండర్ నుంచి వచ్చే మంటలా వస్తుండడంతో తిరిగి తన వ్యాపారాన్ని ప్రారంభించాడు. అమన్ గుప్తా సమీపంలోని వాహన సర్వీస్ సెంటర్ల నుంచి ఈ వేస్ట్ ఆయిల్‌ను సేకరిస్తున్నాడు. ఇది చాలా తక్కువ ధరకు, కొన్నిసార్లు ఉచితంగా కూడా లభిస్తోంది. ఈ వినూత్న పద్ధతి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

ఇండోనేషియాను వణికించిన భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..


పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Apr 02 , 2026 | 02:18 PM