Share News

మృత్యువు మీ కోసం ఎదురుచూస్తోంది.. జర్మనీలో 450కి పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు..

ABN , Publish Date - Nov 23 , 2026 | 07:35 PM

యూరప్‌లో వరుస బాంబు బెదిరింపుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా జర్మనీలోని 450కి పైగా పాఠశాలలకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి.

మృత్యువు మీ కోసం ఎదురుచూస్తోంది.. జర్మనీలో 450కి పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు..
Germany School Bomb Threat

ఇంటర్నెట్ డెస్క్: యూరప్‌లో వరుస బాంబు బెదిరింపుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా జర్మనీలోని 450కి పైగా పాఠశాలలకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. 'మరణం మీ కోసం ఎదురుచూస్తోంది' అనే సందేశంతో కూడిన ఈ మెయిల్స్ పలు పాఠశాలలకు వచ్చాయి. సోమవారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పటివరకు పాఠశాలలకు తక్షణ ప్రమాదం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలూ లేవని పోలీసులు స్పష్టం చేశారు (Germany Schools Bomb Threat).


జర్మనీ రాజధాని బెర్లిన్‌తో పాటు బాడెన్-వుర్టెంబర్గ్, తురింగియా, సాక్సోనీ-అన్హాల్ట్, రైన్‌లాండ్-పాలటినేట్ రాష్ట్రాల్లోని పలు పాఠశాలలకు ఈ బెదిరింపు సందేశాలు అందాయి. వేర్వేరు ప్రాంతాల్లోని పాఠశాలలకు దాదాపు ఒకే విధమైన సందేశాలు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. పాఠశాల భవనాల్లో పేలుడు పదార్థాలు అమర్చామని, వాటిని పేల్చివేస్తామని గుర్తుతెలియని వ్యక్తులు ఈమెయిల్స్‌లో హెచ్చరించినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు బెదిరింపు సందేశాలు వచ్చిన పాఠశాలలను క్షుణ్నంగా తనిఖీ చేశారు. ముందు జాగ్రత్త చర్యగా కొన్ని పాఠశాలలను ఖాళీ చేయించారు. అయితే వారికి ఎక్కడా అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు (Bomb Threat Emails).


ఈ ఈమెయిల్స్‌ను ఎవరు పంపించారు? వాటి వెనుక ఏదైనా సంస్థ లేదా వ్యక్తుల బృందం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు (European Schools Security). జర్మనీతో పాటు డెన్మార్క్‌లోని పలు పాఠశాలలకు కూడా బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక, గత కొన్ని వారాలుగా ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, హంగరీ, సెర్బియా వంటి దేశాల్లోని పాఠశాలలకు కూడా ఇలాంటి నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి. స్పెయిన్‌లో గత వారం పది పాఠశాలలకు పైగా ఖాళీ చేయించాల్సి వచ్చింది.


ఇవి కూడా చదవండి..

స్టాక్ మార్కెట్ క్రాష్.. ఒక్కరోజే రూ.5 లక్షల కోట్లకు పైగా ఆవిరి..


గోద్రా రైలు దహనం కేసు.. 17 ఏళ్ల తర్వాత దోషికి బెయిల్..

Updated Date - Nov 23 , 2026 | 07:35 PM