ఇరాన్ ప్రజలే భవిష్యత్తు నిర్ణయించుకోవాలి : ఈయూ, జీసీసీ
ABN , Publish Date - Mar 05 , 2026 | 08:03 PM
రాన్ - ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర పోరులో పౌరుల రక్షణ తప్పనిసరి అని యూరోపియన్ యూనియన్ (ఈయూ), జీసీసీ (గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్) మంత్రులు స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ, మార్చి 05: ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర పోరులో పౌరుల రక్షణ తప్పనిసరి అని యూరోపియన్ యూనియన్ (ఈయూ), జీసీసీ (గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్) మంత్రులు స్పష్టం చేశారు. గురువారం ఇరాన్ యుద్ధంపై యూరోపియన్ యూనియన్, గల్ఫ్ దేశాల విదేశాంగ మంత్రులు వీడియో కాన్ఫరెన్స్‌లో సమావేశమయ్యారు. అనంతరం వారు సంయుక్త కీలక ప్రకటన చేశారు.
అంతర్జాతీయ చట్టాలను పూర్తిగా గౌరవించాలని వారు పేర్కొన్నారు. ఈ సంక్షోభం పరిష్కారానికి చర్చలు, దౌత్యమే మార్గమని వివరించాయి. యుద్ధం ఆగేందుకు సంయుక్తంగా దౌత్య ప్రయత్నాలు చేయాలని నిర్ణయించాయి. ఇరాన్ అణ్వాయుధాలు పొందకుండా చర్యలు అవసరమని ఈయూ, జీసీసీ అభిప్రాయ పడ్డాయి. ఇరాన్ ప్రజలే తమ భవిష్యత్తును నిర్ణయించుకునే పరిస్థితి రావాలంటూ ఈయూ, జీసీసీ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
ఇరాన్‌పై అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధం కారణంగా చోటు చేసుకునే తీవ్ర పరిణామాల వల్ల ఏర్పడే చిక్కులు.. మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అలాంటి వేళ.. వాటిపై చర్చించేందుకు ఈయూ, జీసీసీ విదేశాంగ మంత్రులు, భద్రతా విధానానికి సంబంధించిన అత్యున్నత స్థాయి ప్రతినిధులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. దీనికి యూరోపియన్ యూనియన్ ఉపాధ్యక్షుడు ఖాజా కల్లాస్ సైతం పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
యూట్యూబర్ దారుణ హత్య.. ఇంట్లో కత్తి పోట్లతో..
ట్రంప్‌నకు ఊరట.. యుద్ధ చర్యల నియంత్రణపై డెమోక్రాట్ల ప్రయత్నం విఫలం
For More International News And Telugu News