స్కీయింగ్ చేసిన సీఎం ఒమర్ అబ్దుల్లా.. వీడియో వైరల్..
ABN , Publish Date - Jan 25 , 2026 | 01:22 PM
జమ్మూ కాశ్మీర్‌లోని గుల్మార్గ్‌లో సీఎం ఒమర్ అబ్దుల్లా పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం ఒమర్ అబ్దుల్లా స్కీయింగ్ చేస్తూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే సీఎం ఒమర్ అబ్దుల్లా మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి వివాదాస్పదంగా కాదు.. ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. ‘భారతదేశ స్కీయింగ్ రాజధాని’గా పిలువబడే గుల్మార్గ్‌లో పర్యటిస్తున్న సందర్భంగా స్కీయింగ్ చేస్తూ టూరిజాన్ని ప్రోత్సాహించారు.
జమ్మూకశ్మీర్‌లో పర్యాటక రంగాన్ని, అంతర్జాతీయ స్థాయిలో స్కీయింగ్ మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం తన ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్కేయింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.