Share News

ఎలాన్ మస్క్‌పై వెయిట్రస్ వేషంలో చైనా జనరల్ గూఢచర్యం

ABN , Publish Date - May 22 , 2026 | 08:28 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బీజింగ్ పర్యటనలో విదేశీ ప్రతినిధులు, టెక్ ఎగ్జిక్యూటివ్‌లపై చైనా గూఢచర్యం జరిపిందనే వార్త కలకలం రేపుతోంది. బీజింగ్‌లో జరిగిన విందులో టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్‌ వెనుక ఒక వెయిట్రస్ నిలబడింది.

ఎలాన్ మస్క్‌పై వెయిట్రస్ వేషంలో చైనా జనరల్ గూఢచర్యం
Elan Musk

బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బీజింగ్ పర్యటనలో విదేశీ ప్రతినిధులు, టెక్ ఎగ్జిక్యూటివ్‌లపై చైనా గూఢచర్యం జరిపిందనే వార్త కలకలం రేపుతోంది. బీజింగ్‌లో జరిగిన విందులో టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్‌ (Elan Mask) వెనుక ఒక వెయిట్రస్ నిలబడింది. అయితే ఆమె హోటల్ సిబ్బంది కాదని, చైనా సైన్యానికి చెందిన అధికారిణి అని స్వతంత్ర బ్లాగర్ జెన్నిఫర్ జంగ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు.


బీజింగ్ గూఢచర్యానికి పాల్పడిందని జెంగ్ ఆరోపించడం ఇది మొదటిసారి కూడా కాదు. కెనడాలో ఖలిస్థాన్ టెర్రరిస్ట్ హర్దీప్ నింగ్ నిజ్జర్ హత్యలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ)కి కీలక పాత్ర ఉందని ఆమె 2023లో ఆరోపించారు. దీని వెనుక 'భారదేశంపై నిందలు వేయడం, ఇండియా-వెస్ట్ మధ్య విభేదాలు సృష్టించడం చైనా ముఖ్యోద్దేశం' అని ఆమె వ్యాఖ్యానించారు.


కాగా, తాజా ఘటనలో ట్రంప్ గౌరవార్దం బీజింగ్‌లో చైనా కమ్యూనిస్టు పార్టీ అధికారిక విందు ఏర్పాటు చేసింది. దీంట్లో మస్క్ వెనుక ఎరుపురంగం డ్రస్‌లో వెయిట్రస్‌ నిలబడి ఉంది. ఆమె చైనా మిలటరీ కమాండర్ మేజర్ చెంగ్ చెంగ్ అని, చైనా కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్ అని జెంగ్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు. వెయిట్రస్ వేషంలో ఉన్న చెంగ్ చెంగ్ ఫోటోతో పాటు మిలటరీ యూనిఫాంలో ఉన్న ఫోటోను కూడా జెంగ్ షేర్ చేశారు.


మేజర్ చెంగ్ చెంగ్ ఎలైట్ బెటాలియన్ కమాండర్‌గా ఉన్నారని, చైనా మిలటరీ వేడుకలకు సంబంధించిన ఆపరేషన్ మ్యాన్యువల్స్ రాయడంలో ఆమె కీలక పాత్ర పోషించారని కూడా జెంగ్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. 'చెంగ్ చెంగ్ ఎరుపు రంగ డ్రస్ వెనుక ఒక తుపాకీ లేదా ఏదైనా నిఘా పరికరం ఉండొచ్చు' అని అనుమానం కూడా ఆమె వ్యక్తం చేశారు. అయితే జెంగ్ ఆరోపణల్లో నిజం ఏమిటనే దానిపై చైనా ప్రభుత్వం ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.


ఇవి కూడా చదవండి..

ఆ పెళ్లికి వెళితే నన్ను బతకనీయరు.. మీడియాపై ట్రంప్ సెటైర్లు

యురేనియాన్ని వదులుకోం

Updated Date - May 22 , 2026 | 08:44 PM