Share News

యురేనియాన్ని వదులుకోం

ABN , Publish Date - May 22 , 2026 | 03:47 AM

తన అణు కార్యక్రమాన్ని పూర్తిగా వదులుకునే ప్రసక్తే లేదని ఇరాన్‌ మరోసారి తేల్చిచెప్పింది. ఇప్పటి వరకు శుద్ధి చేసిన యురేనియాన్ని కూడా వదిలే ప్రసక్తే లేదని పేర్కొంది.

యురేనియాన్ని వదులుకోం

  • శుద్ధిచేసిన యురేనియం ఇరాన్‌లోనే ఉండాలి

  • ఆ దేశ సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ ఆదేశాలు

టెహ్రాన్‌, మే 21: తన అణు కార్యక్రమాన్ని పూర్తిగా వదులుకునే ప్రసక్తే లేదని ఇరాన్‌ మరోసారి తేల్చిచెప్పింది. ఇప్పటి వరకు శుద్ధి చేసిన యురేనియాన్ని కూడా వదిలే ప్రసక్తే లేదని పేర్కొంది. ఈ మేరకు ఇరాన్‌ నూతన సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ తమ దేశ నాయకత్వానికి ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్‌లోని కీలక ఉన్నతాధికారులను ఉటంకిస్తూ రాయిటర్స్‌ వార్తా సంస్థ కథనం ప్రచురించింది. కాగా, ఇరాన్‌ యురేనియాన్ని వదులుకునే ప్ర సక్తే లేదని సుప్రీం లీడర్‌ మొజ్తాబా తాజాగా ఆదేశించారని, ఇతర కీలక నేతలంతా దీనిపై ఏకాభిప్రాయంతో ఉన్నారని ఇరాన్‌ అధికార వర్గాలు పేర్కొన్నాయి. అయితే.. ఇరాన్‌ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియాన్ని కచ్చితంగా స్వాధీనం చేసుకుంటామని ట్రంప్‌ గురువారం వ్యాఖ్యానించారు. నిజానికి ఆ యురేనియం తమకు అవసరం లేదని, ఇరాన్‌ వద్ద ఉండవద్దన్నదే తమ లక్ష్యమని చెప్పారు.

Updated Date - May 22 , 2026 | 03:47 AM