భారతీయ వీసా దరఖాస్తుదారులు.. గుడ్‌న్యూస్ చెప్పిన కెనడా..
ABN , Publish Date - Apr 21 , 2026 | 03:37 PM
కెనడా వెళ్లాలనుకునే భారతీయులకు శుభవార్త. తాజాగా కెనడా ప్రభుత్వం తాత్కాలిక నివాస దరఖాస్తులతో పాటు విజిటర్స్ వీసా, స్టడీ పర్మిట్స్, సూపర్ వీసా ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించింది. వీసా ప్రాసెసింగ్ సమయాన్ని వేగవంతం చేయడంతో, భారతీయ అభ్యర్థులకు వీసా త్వరగా లభిస్తోంది.
కెనడా వెళ్లాలనుకునే భారతీయులకు శుభవార్త. తాజాగా కెనడా ప్రభుత్వం తాత్కాలిక నివాస దరఖాస్తులతో పాటు విజిటర్స్ వీసా, స్టడీ పర్మిట్స్, సూపర్ వీసా ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించింది. వీసా ప్రాసెసింగ్ సమయాన్ని వేగవంతం చేయడంతో, భారతీయ అభ్యర్థులకు వీసా త్వరగా లభిస్తోంది. ఈ మేరకు కెనడా ఇమిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ తాజాగా వివరాలు వెల్లడించింది (Indian applicants Canada visa).
విజిటర్ వీసాల ప్రాసెసింగ్‌ను 37 రోజుల నుంచి 23 రోజులకు, స్టడీ పర్మిట్ వీసాను 4 వారాల నుంచి 3 వారాల వరకు, సూపర్ వీసా ప్రాసెసింగ్‌ను 202 రోజుల నుంచి 182 రోజులకు తగ్గించింది. ప్రత్యేకంగా భారతీయ దరఖాస్తుదారులకు వెయిటింగ్ టైమ్ గణనీయంగా తగ్గింది. ఇతర దేశాలతో పోలిస్తే వేగంగా వీసా ప్రాసెసింగ్ జరగనుంది (Canada visitor visa).
తాత్కాలిక వీసా కేటగిరిల్లో మెరుగుదలను ఈ గణాంకాలు వెల్లడించాయి (Canada visa processing time). దరఖాస్తుల సంఖ్య, రకం, పని భారాన్ని బట్టి ఈ ప్రాసెసింగ్ సమయంలో మార్పులు ఉంటాయని కెనడా అధికారులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: ఒకే సెంచరీ.. పలు రికార్డులు బద్దలు
ఐపీఎల్ 2026: తొలి సెంచరీపై తిలక్ వర్మ కీలక వ్యాఖ్యలు