బెల్జియం ఆంట్వెర్ప్‌లో ఘోర అగ్నిప్రమాదం.. అపార్ట్‌మెంట్‌లో మంటలు
ABN , Publish Date - Jul 01 , 2026 | 05:45 PM
బెల్జియంలోని ఆంట్వెర్ప్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక పార్ట్‌మెంట్‌లో బుధవారం ఉదయం చెలరేగిన మంటలు పలువురి ప్రాణాలను బలితీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: బెల్జియంలోని ఆంట్వెర్ప్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక పార్ట్‌మెంట్‌లో బుధవారం ఉదయం చెలరేగిన మంటలు పలువురి ప్రాణాలను బలితీసుకున్నాయి. అలాగే అధిక సంఖ్యలో గాయపడినట్లు తెలుస్తోంది. లింకెరోవర్ ప్రాంతంలో ఉన్న 10 అంతస్తుల అపార్ట్‌మెంట్‌లోని ఎనిమిదో అంతస్తులో అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక దళం, రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించారు.
భవనంలో సుమారు 200 మందికి పైగా నివాసితులు ఉన్నట్లు సమాచారం. మంటలు వేగంగా వ్యాపించడంతో అధికారులు వెంటనే మొత్తం భవనాన్ని ఖాళీ చేయించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. ఘటనకు గల కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
Also Read:
వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహారాలకు దూరంగా ఉండండి
ట్రెక్కింగ్.. ఆయాసం వస్తే ఏం చేయాలి?