Share News

హసీనా బంగ్లాదేశ్‌కు వస్తే ఉరిశిక్ష తప్పదు!

ABN , Publish Date - Nov 11 , 2026 | 03:33 AM

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా తిరిగి స్వదేశంలో అడుగుపెడితే ఆమెకు ఉరిశిక్ష అమలు చేయడం మినహా ఆమెకు మరో మార్గం లేదని బంగ్లాదేశ్‌ ప్రాసిక్యూషన్‌ తేల్చిచెప్పింది

హసీనా బంగ్లాదేశ్‌కు వస్తే ఉరిశిక్ష తప్పదు!
hasina

  • బంగ్లాదేశ్‌ హెచ్చరిక.. డిసెంబర్‌లో వస్తానన్న షేక్‌ హసీనా

ఢాకా, నవంబరు 10: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా తిరిగి స్వదేశంలో అడుగుపెడితే ఆమెకు ఉరిశిక్ష అమలు చేయడం మినహా ఆమెకు మరో మార్గం లేదని బంగ్లాదేశ్‌ ప్రాసిక్యూషన్‌ తేల్చిచెప్పింది. ఉద్యమకారుల అణచివేతకు హసీనానే బాధ్యురాలు అంటూ ఆమెకు బంగ్లాదేశ్‌ ఇంటర్నేషనల్‌ కోర్టు మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానని ప్రకటించారు. ఉరి తీస్తారని తెలిసి కూడా ప్రజల పట్ల ఉన్న బాధ్యతతోనే తిరిగి వస్తున్నట్లు ఇటీవల పేర్కొన్నారు. డిసెంబర్‌లో హసీనా పునరాగమనం ఖాయమనే ప్రచారం నేపథ్యంలో బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా రణరంగంగా మారింది. నగర వ్యాప్తంగా ఇప్పటివరకు 50కి పైగా నాటుబాంబులు పేలగా, దుండగులు ఎనిమిది బస్సులకు నిప్పుపెట్టారు. షేక్‌ హసీనా నేతృత్వంలోని అవామీలీగ్‌ మద్దతుదారులు బంగ్లాదేశ్‌లో అస్థిరత సృష్టించడానికే దాడులకు తెగబడుతున్నారని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం ఆరోపిస్తుండగా, ప్రభుత్వం కావాలనే తమ వారిపై బురద జల్లుతోందని అవామీలీగ్‌ విమర్శిస్తోంది.

ఇవి కూడా చదవండి..

బంగ్లాదేశ్‌లో అడుగుపెడితే షేక్ హసీనాకు ఉరిశిక్ష అమలు తప్పదు!

దాడికి సిద్ధంగా ఉన్నాం.. ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడి వార్నింగ్..

Updated Date - Nov 11 , 2026 | 03:37 AM