Share News

Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి కాల్చివేత.. మూడు వారాల్లో ఐదో ఘటన

ABN , Publish Date - Jan 05 , 2026 | 08:36 PM

ప్రత్యక్ష సాక్షులు, పోలీసు వర్గాల సమాచారం ప్రకారం మార్కెట్‌కు వచ్చిన రాణాప్రతాప్‌పై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి కాల్చివేత.. మూడు వారాల్లో ఐదో ఘటన
Rana pratap

ఢాకా: బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై హత్యాకాండలు ఆగడం లేదు. సోమవారం సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో అందరూ చూస్తుండగానే మరో హిందూ యువకుడిపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతను అక్కడికక్కడే మృతిచెందగా.. దుండగులు పరారయ్యారు. బంగ్లాదేశ్‌లోని జస్సోర్ జిల్లా కేశబ్పూర్ ఉప జిల్లా వార్డు నెంబర్-17లోని కొపలియా బజార్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. మృతుని కేశబ్రూర్ ఉపజిల్లాలోని అరువా గ్రామానికి చెందిన రాణాప్రతాప్ (45)గా గుర్తించారు.


ప్రత్యక్ష సాక్షులు, పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. మార్కెట్‌కు వచ్చిన రాణాప్రతాప్‌పై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలిసిన మణిరాంపూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోనికి తెచ్చారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం పంపామని, నిందితుల కోసం గాలిస్తున్నామని ఆఫీసర్ ఇన్‌ఛార్జి రజివుల్లా ఖాన్ తెలిపారు. కొద్దికాలంగా దేశవ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు, ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ తరహా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం గత మూడు వారాల్లో ఇది ఐదోసారి.


ఇవి కూడా చదవండి..

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ నివాసంపై దాడి

ట్రంప్ ప్రభుత్వాన్ని హేళన చేస్తూ మదురో డ్యాన్స్.. జీవితం తలకిందులు

Updated Date - Jan 05 , 2026 | 10:06 PM