Trump Criticizes India: భారత్‌పై ట్రంప్ ఆగ్రహం.. సుంకాలు విధిస్తామంటూ హెచ్చరిక
ABN , Publish Date - Jan 05 , 2026 | 09:23 AM
ట్రంప్ ఇప్పటికే భారత్‌నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న చాలా వస్తువులపై 50 శాతం టారిఫ్‌లు విధించారు. భారత వ్యాపారాన్ని దెబ్బ తీసేలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. మరోసారి భారత్, రష్యా వాణిజ్య ఒప్పందాలపై ఆయన ఫైర్ అయ్యారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌ను టార్గెట్ చేశారు. రష్యాతో భారత్ స్నేహంగా ఉండటాన్ని.. మరీ ముఖ్యంగా చమురు దిగుమతి చేసుకోవటాన్సి ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎలాగైనా రష్యా నుంచి భారత్‌ను దూరం చేయాలని భావిస్తున్నారు. అధిక సుంకాలు విధిస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఇప్పటికే భారత్‌నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న చాలా వస్తువులపై 50 శాతం టారిఫ్‌లు విధించారు. భారత వ్యాపారాన్ని దెబ్బ తీసేలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. మరోసారి భారత్, రష్యా వాణిజ్య ఒప్పందాలపై ఆయన ఫైర్ అయ్యారు.
ఈ మేరకు వైట్ హౌస్.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన ఆడియోను సోమవారం మీడియాకు విడుదల చేసింది. ఆ ఆడియోలో ఏముందంటే..‘ అమెరికాతో భారత్ వాణిజ్య లావాదేవీలు కొనసాగిస్తోంది. భారత్ వాణిజ్య లావాదేవీలపై త్వరలో సుంకాలు పెంచుతా. భారత్ నన్ను సంతోషపెట్టాలని కోరుకుంటోంది. ప్రధాని మోదీ చాలా మంచి వ్యక్తి. నేను సంతోషంగా లేనని ప్రధాని మోదీకి తెలుసు. నన్ను సంతోషపెట్టడం భారత్‌కు చాలా ముఖ్యం’ అని చెప్పుకొచ్చారు. కాగా, గతంలో భారత్‌పై అమెరికా 50 శాతం టారిఫ్‌లు విధించింది.
ఇందులో 25 శాతం టారిఫ్‌లు కేవలం రష్యాతో ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న కారణంగా విధించింది. డొనాల్డ్ ట్రంప్ చెబుతున్న దాని ప్రకారం అమెరికా అత్యధిక టారిఫ్‌లు వేసిన దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంది. రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటున్న నేపథ్యంలో బైలటెరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ (బీటీఏ) చేసుకోవాలని ఇండియా చూస్తోంది. అతి త్వరలో ఇందుకు సంబంధించిన అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
నేను చెప్పినట్టే చేయకపోతే.. వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలికి ట్రంప్ హెచ్చరిక..
దగ్గు, జలుబుతో బాధపడుతున్నారా? ఈ ఆయుర్వేద చిట్కాలు ట్రై చేయండి.!