Share News

అండమాన్ సముద్రంలో పడవ బోల్తా.. 250 మంది గల్లంతు

ABN , Publish Date - Apr 15 , 2026 | 11:56 AM

ప్రకృతి అందాలకు నిలయమైన అండమాన్ సముద్రం. నేడు వరుస ప్రమాదాలతో కన్నీటి సంద్రంగా మారుతోంది. అండమాన్ సముద్రం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

అండమాన్ సముద్రంలో పడవ బోల్తా.. 250 మంది గల్లంతు
Andaman Sea tragedy

ఇంటర్నెట్ డెస్క్: ప్రకృతి అందాలకు నిలయమైన అండమాన్ సముద్రం.. నేడు వరుస ప్రమాదాలతో కన్నీటి సంద్రంగా మారుతోంది. ఒకవైపు పర్యాటక రంగం, మరోవైపు శరణార్థుల వలసలు, ఇంకోవైపు మత్స్యకారుల జీవనోపాధి.. ఇలా నిరంతరం రద్దీగా ఉండే ఈ జలమార్గం ఇప్పుడు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. అండమాన్‌ సముద్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్‌ పౌరులతో వెళుతున్న ఓ పడవ మునిగిపోయింది. ఘటనలో దాదాపు 250 మంది గల్లంతయ్యారు. వారి కోసం సముద్రంలో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. బలమైన ఈదురు గాలులు, అల్లకల్లోలమైన సముద్రం, సామర్థ్యానికి మించి ప్రయాణించడమే ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.


దక్షిణ బంగ్లాదేశ్‌లోని టెక్నాఫ్ నుంచి మలేషియాకు వెళ్తుండగా ఈ పడవ మునిగిపోయిందని ఐక్యరాజ్యసమితి శరణార్థుల హై కమిషనర్ (UNHCR) ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, ప్రమాదానికి గురైన నౌకలో సుమారు 280 మంది ప్రయాణిస్తున్నారని, అది ఏప్రిల్ 4న బంగ్లాదేశ్ నుంచి బయలుదేరినట్లు తెలుస్తోంది. కాక్స్ బజార్‌లోని శరణార్థుల శిబిరాల్లో ఉన్న వీరు జీవనోపాధికోసం మలేషియాకు వలస వెళుతుండగా ఈ ఘోర ఘటన జరిగినట్లు ఐక్యరాజ్య సమితి అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వైఎస్ జగన్ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్

ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

For More National News And Telugu News

Updated Date - Apr 15 , 2026 | 02:11 PM