Share News

రూ.75 వేల కోట్ల ‘డేటా సెంటర్‌’ సామ్రాజ్యం!

ABN , Publish Date - Nov 19 , 2026 | 02:01 AM

ఎన్విడియా సీఈవో జెన్సన్‌ హువాంగ్‌ పదవిని కోల్పోవడానికి దారితీసిన సంచలన వ్యవహారంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి

రూ.75 వేల కోట్ల ‘డేటా సెంటర్‌’ సామ్రాజ్యం!
images

  • చైనా మద్దతుతో నిర్మించిన అలిస్‌ భర్త కాంగ్‌

వాషింగ్టన్‌, నవంబరు 18: ఎన్విడియా సీఈవో జెన్సన్‌ హువాంగ్‌ పదవిని కోల్పోవడానికి దారితీసిన సంచలన వ్యవహారంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. చైనా గూఢచారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అలిస్‌ హువాంగ్‌తో ఆయనకు ఉన్న వివాహేతర సంబంధం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంలో అలిస్‌ భర్త పాత్ర మరింత ఆశ్చర్యకరంగా ఉందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తాజా కథనం వెల్లడించింది. అలిస్‌ టెక్‌ దిగ్గజాల రహస్యాలు రాబట్టే పనిలో ఉండగా.. ఆమె భర్త కాంగ్‌ వీ చైనాలో ఏకంగా 9 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.75,000 కోట్ల) భారీ డేటా సెంటర్‌ సామ్రాజ్యాన్ని నిర్మించినట్లు తెలిపింది. చైనా కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో అగ్రగామిగా ఎదగాలన్న కలను సాకారం చేసుకోవడానికి అలిస్‌, కాంగ్‌ జంట ఒక వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకు వెళ్లినట్లు తేలింది. జెన్సన్‌ హువాంగ్‌కు అలిస్‌ అత్యంత సన్నిహితంగా మెలిగి, అమెరికా ప్రభుత్వం చైనాలోకి ప్రవేశించకుండా కఠిన ఆంక్షలు విధించిన అధునాతన చిప్‌లను అక్రమ మార్గాల్లో తరలించేందుకు ప్రయత్నించారు.


షాంఘై కేంద్రంగా వ్యాపారాలు సాగించే కాంగ్‌.. చైనా ప్రభుత్వ మద్దతుతో దేశవ్యాప్తంగా భారీ డేటా సెంటర్ల నెట్‌వర్క్‌ను విస్తరించే పనిలో పడ్డారు. టెక్నాలజీకి అవసరమైన అడ్వాన్స్‌డ్‌ చిప్‌లు భార్య ద్వారా సమకూరుతుండగా, వాటిని రన్‌ చేయడానికి కావల్సిన భారీ డేటా సెంటర్లను కాంగ్‌ సిద్ధం చేశారు. చైనా ప్రభుత్వ మద్దతుతో కాంగ్‌ తన ‘హెక్సీ క్యాపిటల్‌, సెంచరీ లాంగ్‌టెంగ్‌’ సంస్థల ద్వారా వుహులో సుమారు 4.5 బిలియన్‌ డాలర్ల వ్యయంతో 2022లో భారీ ఇంటెలిజెంట్‌-కంప్యూటింగ్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌కు శ్రీకారం చుట్టారు. 2024 జూలైలో సుమారు 5 బిలియన్‌ డాలర్ల అంచనా వ్యయంతో మరో భారీ డేటా సెంటర్‌ ప్రాజెక్ట్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. చైనా చేపట్టిన ‘ఈస్ట్‌ డేటా, వెస్ట్‌ కంప్యూటింగ్‌’ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాజెక్ట్‌లన్నింటికీ విద్యుత్తు, ఇతర మౌలిక వసతులను కల్పించడం గమనార్హం.

ఇవి కూడా చదవండి..

కాంగ్రెస్‌కు అఖిలేశ్ యాదవ్ షాకిచ్చారా.. కేవలం 24 సీట్లే ఇస్తామంటూ ఆఫర్..

జంతుబలులను నిషేధించాలంటూ పిటిషన్‌.. కొట్టివేసిన సుప్రీంకోర్టు

Updated Date - Nov 19 , 2026 | 02:03 AM