Share News

23 ఏళ్ల వయసు.. రూ.39 వేల కోట్ల సంపద

ABN , Publish Date - Nov 14 , 2026 | 03:08 AM

భారతీయ మూలాలున్న ఇద్దరు యువకులు కేవలం 23 ఏళ్ల వయసులోనే చెరో రూ.39 వేల కోట్లకుపైగా సంపదకు యజమానులుగా మారారు.

23 ఏళ్ల వయసు.. రూ.39 వేల కోట్ల సంపద
persons

  • ఏఐ కంపెనీ మెర్కర్‌ సహ వ్యవస్థాపకులు ఆదర్శ్‌ హిరేమత్‌, సూర్య మిధా రికార్డు

  • కంపెనీలో ఇరువురికీ చెరో 21శాతం వాటా

  • ఒక్కొక్కరి సంపద రూ.39,591 కోట్లు

వాషింగ్టన్‌, నవంబరు 13: భారతీయ మూలాలున్న ఇద్దరు యువకులు కేవలం 23 ఏళ్ల వయసులోనే చెరో రూ.39 వేల కోట్లకుపైగా సంపదకు యజమానులుగా మారారు. వారే ఏఐ స్టార్టప్‌ కంపెనీ ‘మెర్కర్‌’ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ ఆదర్శ్‌ హిరేమత్‌, అదే కంపెనీ బోర్డు చైర్మన్‌ సూర్య మిధా. కంపెనీలో 21శాతం చొప్పున వాటా ఉన్న వారి విడివిడి ఆస్తుల విలువ 420 కోట్ల డాలర్లు (రూ.39,591 కోట్లు). మెర్కర్‌ ఇటీవల నిధుల సమీకరణలో భాగంగా 75 కోట్ల డాలర్లను సేకరించింది. దీంతో కంపెనీ విలువ 2000 కోట్ల డాలర్లకు (రూ.1,88,528 కోట్లు) చేరుకుంది. ఫలితంగా, సంస్థలో గణనీయంగా వాటాలున్న ఆదర్శ్‌, సూర్య ఆస్తులు కూడా ఒక్కసారిగా పెరిగిపోయాయి. మెర్కర్‌ సీఈవో బ్రెండెన్‌ ఫుడీ కూడా 23 ఏళ్ల యువకుడే కావటం గమనార్హం. ఈ ముగ్గురూ కలిసి కంపెనీని స్థాపించారు. గత ఏడాది అంటే.. వీరికి 22 ఏళ్ల వయసు ఉన్నప్పుడే బిలియనీర్లుగా మారి ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసులో ఆ ఘనత సాధించిన యువకులుగా నిలిచారు. అప్పటి వరకూ ఆ రికార్డు ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ పేరు మీద ఉండేది. ఆదర్శ్‌, సూర్య అమెరికాలోని కాలిఫోర్నియాలో ఒకే పాఠశాలలో చదివారు. స్కూల్‌ డిబేట్‌టీంలో సభ్యులుగా ఉండేవారు. ‘నేషనల్‌ పాలసీ డిబేట్‌ చాంపియన్‌షి్‌ప్స’ మూడింటినీ ఒక్క ఏడాదిలోనే సాధించి ఆ స్కూల్‌ చరిత్రలో కొత్త రికార్డు నెలకొల్పారు. 2023లో బ్రెండెన్‌ ఫుడీతో కలిసి మెర్కర్‌ను రిక్రూట్‌మెంట్‌ స్టార్టప్ ను ఏర్పాటు చేశారు.

ఇవి కూాడా చదవండి..

విచిత్రం: ఓవర్ స్పీడ్‌కు చలానా.. లొకేషన్ మాత్రం అట్లాంటిక్ మహాసముద్రం!

అస్సాంలో ఘోర ప్రమాదం.. మినీబస్సు, కంటైనర్ ట్రక్కు ఢీకొని పలువురి మృతి

Updated Date - Nov 14 , 2026 | 03:42 AM