Share News

వేసవిలో చుండ్రు, మాడు దురద సమస్యలా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి

ABN , Publish Date - May 01 , 2026 | 03:09 PM

వేసవి కాలంలో చుండ్రు, మాడు దురద సమస్యలలో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. కొన్ని చిట్కాలతో ఆ సమస్యలను దూరం చేసుకోవచ్చు. అవేంటో చూద్దాం..

వేసవిలో చుండ్రు, మాడు దురద సమస్యలా?  ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
Summer Dandruff Remedies

ఇంటర్నెట్ డెస్క్: వేసవి కాలంలో చాలామంది ఎదుర్కొనే సమస్యలలో చుండ్రు సమస్య ఒకటి. వయసుతో సంబంధం లేకుండా ఎంతోమంది దీని వలన ఇబ్బంది పడుతుంటారు. వేసవి కాలంలో పెరిగే ఉష్ణోగ్రతలు, చెమట వల్ల జుట్టు, మాడుకి సంబంధించిన సమస్యలు ఎక్కువగా తలెత్తుతుంటాయి. ముఖ్యంగా చుండ్రు, దురద చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. వీటిని అరికట్టి, మీ మాడును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.


1. వేసవిలో చెమట వల్ల మాడుపై మురికి, నూనె పేరుకుపోతాయి. ఇది ఫంగస్ పెరగడానికి దారితీస్తుంది. వారానికి కనీసం 3 నుంచి 4 సార్లు మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. జిడ్డు ఎక్కువగా ఉంటే వైద్యులు సూచించిన యాంటీ-డాండ్రఫ్ షాంపూను వాడటం మంచిది.

2. చెమట పట్టినప్పుడు జుట్టును అలాగే ముడి వేయకూడదు. చెమట వల్ల తేమ చేరి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. కాబట్టి, తలస్నానం తర్వాత జుట్టును పూర్తిగా ఆరనివ్వాలి. ఆడవాళ్లు బయట తిరిగేటప్పుడు నేరుగా ఎండ తగలకుండా గొడుగు లేదా స్కార్ఫ్ ఉపయోగించడం ఉత్తమం.

3. చుండ్రును తగ్గించడానికి ఇంట్లో దొరికే వస్తువులు బాగా పనిచేస్తాయి. తలస్నానానికి ముందు మాడుకు నిమ్మరసం పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేస్తే చుండ్రు తగ్గుతుంది. అలోవెరా (కలబంద) ఇది మాడుకు చలువనిస్తుంది, దురదను తగ్గిస్తుంది. వేప నీటితో తలస్నానం చేయడం వల్ల ఇన్ఫెక్షన్లు దరిచేరవు.

4. మనం తీసుకునే ఆహారం కూడా జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడానికి రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగాలి. మసాలాలు, వేపుళ్లు తగ్గించి పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. జింక్, విటమిన్ బి ఉండే ఆహారం చుండ్రును నివారిస్తుంది.

5. ఇతరుల వస్తువులను వాడటం వల్ల కూడా చుండ్రు వ్యాపిస్తుంది. మీరు వాడే దువ్వెనలు, టవల్స్, దిండు గలీబులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఇతరుల దువ్వెనలను అస్సలు వాడకూడదు.

6. వేసవిలో జుట్టు బలహీనంగా ఉంటుంది. హెయిర్ కలర్స్, జెల్స్ లేదా స్టైలింగ్ ఉత్పత్తులను ఈ సీజన్‌లో తగ్గించడం మంచిది. ఇవి మాడును మరింత పొడిగా మార్చి దురదను పెంచుతాయి.

7. పుదీనా రసం మాడుకు బాగా పట్టించిన తర్వాత ఓ అరగంట సేపు ఆరనివ్వాలి.. ఆ తర్వాత తల స్నానం చేస్తే చుండ్రు సమస్య దూరం అవుతుంది. మందార ఆకులు, మందార పువ్వు రేకులను పేస్ట్ చేసి జుట్టుకు పట్టించి స్నానం చేస్తే చుండ్రును చాలా వరకు అరికట్టొచ్చు. మెంతి ఆకును దంచి పేస్ట్ లా చేసి తలకు రాస్తే చుండ్రు, దురద సమస్యలు దూరమవుతాయి.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

మటన్ తినడం వల్ల నిజంగా యూరిక్ యాసిడ్ పెరుగుతుందా..

ఇంట్లో కుక్కలను పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా..

For More Latest News

Updated Date - May 01 , 2026 | 07:08 PM