Share News

చెరకు రసం తాగేముందు జాగ్రత్త..

ABN , Publish Date - Apr 25 , 2026 | 01:51 PM

వేసవిలో చెరకు రసం తాగడం చాలా మందికి అలవాటు. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడంతో పాటు తక్షణ శక్తిని అందిస్తుంది. అయితే, ఈ హెల్తీ డ్రింక్ అందరికీ మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చెరకు రసం తాగేముందు జాగ్రత్త..
Sugarcane Juice Side Effects

ఇంటర్నెట్ డెస్క్: వేసవిలో చాలా మంది చెరకు రసం తాగడానికి ఇష్టపడుతారు. చెరుకు రసంలో అనేక పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది, తక్షణ శక్తిని ఇస్తుంది. అయితే, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకోవడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


మధుమేహం ఉన్నవారు:

చెరకు రసంలో సహజ చక్కెర చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని తాగితే రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరుగుతుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు దీనిని తాగకపోవడం మంచిది.

అధిక బరువు ఉన్నవారు:

చెరకు రసంలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఎక్కువగా తాగితే బరువు పెరగడానికి కారణమవుతుంది. కాబట్టి చాలా మితంగా మాత్రమే తీసుకోవాలి.


జీర్ణ సమస్యలు ఉన్నవారు:

అజీర్ణం, గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు ఉన్నవారికి చెరకు రసం మంచిది కాదు. ఇది సమస్యలను మరింత పెంచే అవకాశం ఉంది.

తాగేటప్పుడు జాగ్రత్తలు:

  • ఎప్పుడూ తాజాగా, శుభ్రంగా తయారైన చెరకు రసం మాత్రమే తాగాలి.

  • ఖాళీ కడుపుతో తాగకూడదు.

  • ఎక్కువగా తాగడం మంచిది కాదు.

  • ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్ సలహా తీసుకోవాలి.


(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Also Read:

మటన్ తినడం వల్ల నిజంగా యూరిక్ యాసిడ్ పెరుగుతుందా..

ఇంట్లో కుక్కలను పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా..

For More Latest News

Updated Date - Apr 25 , 2026 | 01:54 PM