Share News

ఎక్కువగా ఉప్పు తీసుకునే వారికి కాల్షియం లోపం ఉంటుందా?

ABN , Publish Date - Apr 24 , 2026 | 06:58 PM

రోజువారీ ఆహారంలో ఉప్పు అవసరమైనదే అయినప్పటికీ, దాన్ని అధికంగా తీసుకుంటే శరీరంలో కాల్షియం సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఎముకల బలహీనత వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఎక్కువగా ఉప్పు తీసుకునే వారికి కాల్షియం లోపం ఉంటుందా?
Salt And Calcium Relationship

ఇంటర్నెట్ డెస్క్: ఉప్పు మన రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా ఉండే పదార్థం. ఏ వంటలోనైనా ఉప్పు లేకపోతే అసలు రుచి తెలియదు. ఇది నాడుల పనితీరుకు సహాయపడుతుంది. అయితే, దీన్ని ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవడం ఆరోగ్యకరం. అధిక ఉప్పు వాడకం రక్తపోటు (BP), గుండె, కిడ్నీ సమస్యలకు దారితీస్తుంది. అంతేకాకుండా, అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న కాల్షియం మూత్రం ద్వారా ఎక్కువగా బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో కాల్షియం లోపం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాల్షియం ఎముకలు, దంతాల బలానికి చాలా అవసరం కాబట్టి దీని తగ్గుదల ఎముకల బలహీనతకు దారితీస్తుంది.


ఈ సమస్య ముఖ్యంగా ఇప్పటికే కాల్షియం లోపం ఉన్నవారిలో, వృద్ధుల్లో, మహిళల్లో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. అయితే, ఉప్పు పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. మితంగా తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. అలాగే పాలు, పెరుగు, ఆకుకూరలు వంటి కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. సరైన ఆహార అలవాట్లు పాటిస్తే ఉప్పు వల్ల వచ్చే కాల్షియం లోపాన్ని తగ్గించుకోవచ్చు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

హెల్తీ పీనట్ బటర్ రెసిపీ.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా

కిడ్నీ బాధితులు పుచ్చకాయ తినడం మంచిదేనా?

For More Latest News

Updated Date - Apr 24 , 2026 | 07:16 PM