ఆర్టీసీ సమ్మెపై చర్చలు.. పెండింగ్ సమస్యల పరిష్కారంపై కీలక నిర్ణయాలు
ABN , Publish Date - Apr 24 , 2026 | 06:32 PM
మంత్రులు, ఆర్టీసీ సంఘాల నేతల మధ్య చర్చలు సుహృద్భావ వాతావరణంలో కొనసాగుతున్నాయి. మంత్రుల బృందం అన్ని సంఘాల అభిప్రాయాలను సవివరంగా నమోదు చేసుకుంటోంది.
హైదరాబాద్, ఏప్రిల్ 24: మంత్రులు, ఆర్టీసీ సంఘాల నేతల మధ్య చర్చలు సుహృద్భావ వాతావరణంలో కొనసాగుతున్నాయి. మంత్రుల బృందం అన్ని సంఘాల అభిప్రాయాలను సవివరంగా నమోదు చేసుకుంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే తమ దశాబ్దాల పెండింగ్ సమస్యలు తీరాయని ఈ సందర్భంగా ఆర్టీసీ సంఘాల నేతలు మంత్రులకు చెప్పారు. గత ప్రభుత్వంలో 55 రోజులు సమ్మె చేసినా ఎలాంటి హామీ నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండు సంవత్సరాల కాలంలోనే 2013 బాండ్స్.. రూ. 280 కోట్లు క్లియర్ చేసిందని తెలిపారు. 2017కి సంబంధించి పీఆర్సీ ఇచ్చిందని.. డీఏలు పెండింగ్ లేకుండా చేసిందని.. సీసీఎస్, పీఎఫ్ బకాయిలు తీర్చిందని వెల్లడించారు. యూనియన్‌లు లేకపోవడంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అనేక కార్మిక సంక్షేమ కార్యక్రమాలకు ప్రచారం జరగలేదని మంత్రులకు ఆర్టీసీ సంఘాల నేతలు వివరించారు.
ఇవి కూడా చదవండి
జమ్ముకశ్మీర్‌లో కూలిన ఎయిర్‌ఫోర్స్ విమానం
రైలు మిస్ అయితే అదే టికెట్‌తో మరో రైలులో ప్రయాణించవచ్చా?