Stress Effects on Body: ఒత్తిడి మీ శరీరాన్ని ఎలా నాశనం చేస్తుందో తెలుసా
ABN , Publish Date - Jan 17 , 2026 | 08:26 AM
‘ఒత్తిడి’.. వ్యక్తి జీవితాన్ని చిత్తు చేసేస్తుంది. నేటి ఉరుకులు పరుగుల జీవితంలో ఒత్తిడి కారణంగా ప్రజలు మానసికంగానే కాక.. శారీరకంగానూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శరీరంలో మార్పులు చోటు చేసుకుని అనారోగ్యానికి గురవుతున్నారు. ఒత్తిడి కారణంగా శరీరంలో చోటు చేసుకునే మార్పులు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: ఒత్తిడి ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. ఆర్థిక సమస్యలు, ఆఫీసు పనులు, కుటుంబ బాధ్యతలు వంటి ఎన్నో కారణాలు మనల్ని రోజూ ఒత్తిడికి గురిచేస్తుంటాయి. కానీ చాలా మంది దీనిని తేలికగా తీసుకుంటారు. ఇదంతా మామూలేనని అనుకుంటారు. అయితే, నిజానికి ఒత్తిడి మన శరీరంపై చాలా తీవ్ర ప్రభావం చూపుతుంది.
నిరంతరం ఒత్తిడిలో ఉంటే మన శరీరంలో కార్టిసాల్, అడ్రినలిన్ వంటి హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతాయి. ఇవి అవసరానికి మించి ఉంటే శరీరానికి విషంలా పని చేస్తాయి. గుండె, మెదడు, జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం చూపుతాయి. ఒత్తిడి మానసిక సమస్యలకే కాదు, శారీరక మార్పులకు కూడా కారణమవుతుంది. అతిగా ఆలోచించడం వల్ల జుట్టు రాలడం నుంచి గుండె జబ్బుల వరకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ఒత్తిడి వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే:
హార్మోన్ల అసమతుల్యత: ఒత్తిడి పెరిగినప్పుడు కార్టిసాల్, అడ్రినలిన్ హార్మోన్లు అధికంగా విడుదలవుతాయి. దీని వల్ల రక్తపోటు పెరుగుతుంది, గుండెపై అదనపు ఒత్తిడి పడుతుంది.
జీర్ణ సమస్యలు: ఒత్తిడితో అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. జీర్ణక్రియ మందగిస్తుంది. కొంతమందికి ఆకలి తగ్గిపోతే, మరికొందరు అతిగా తినడం వల్ల బరువు పెరుగుతారు.
రోగనిరోధక శక్తి తగ్గుతుంది: ఎప్పుడూ ఒత్తిడిలో ఉంటే శరీర రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీంతో జలుబు, జ్వరం, ఇన్ఫెక్షన్లు తరచుగా వస్తాయి.
మెదడుపై ప్రభావం: జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత లేకపోవడం, చిన్న నిర్ణయాలు కూడా తీసుకోలేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

ఇలా ఒత్తిడి తగ్గించుకోండి:
ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల వ్యాయామం లేదా యోగా చేయాలి
రోజూ 7–8 గంటలు నిద్రపోవాలి
సానుకూలంగా ఆలోచించాలి
అవసరమైతే డాక్టర్ లేదా కౌన్సిలర్ సలహా తీసుకోవడం మంచిది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు.
Also Read:
రోజూ పాలు తాగుతున్నారా.. ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..
విటమిన్ సప్లిమెంట్స్ ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుంటున్నారా? ఇది తెలుసుకోండి..
For More Latest News