Milk Side Effects: రోజూ పాలు తాగుతున్నారా.. ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..
ABN , Publish Date - Jan 17 , 2026 | 07:41 AM
పాలలో పోషకాలు మెండుగా ఉంటాయి. రోజూ పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అయితే, పాలు ఎంత మేలు చేసేవి అయినప్పటికీ.. అందరికీ క్షేమకరం కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి పాలు ఎవరు తాగొద్దనేది ఈ కథనంలో తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: పాలు ఆరోగ్యానికి మంచివేనని అందరికీ తెలుసు. పాలు తాగితే శరీరానికి బలం వస్తుందని, ఎముకలు బలపడతాయని అంటారు. పాలలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్లు వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. కాబట్టి రోజువారీ ఆహారంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే, పాలు అందరికీ ఒకే విధంగా ఉపయోగపడవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. పాలు అందరికీ మంచివి కావు. కొంత మందికి పాలు తాగిన తర్వాత కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలు, విరేచనాలు వంటి వచ్చే అవకాశం ఉంది. కొందరికి చర్మ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీనికి ప్రధాన కారణం పాలల్లో ఉండే లాక్టోస్‌ని జీర్ణం చేసే సామర్థ్యం లేకపోవడమే. ఈ సమస్య ఉన్నవారిలో పాలు జీర్ణం కావడం కష్టంగా మారి.. జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.
అలాగే కొంతమందికి పాలంటే అలెర్జీ ఉండవచ్చు. పాలు తాగడం వల్ల కఫం పెరగడం, జలుబు లేదా శ్వాసకోశ సమస్యలు ఎక్కువ కావచ్చు. ఇప్పటికే జీర్ణ సమస్యలు ఉన్నవారికి పాలు మరింత ఇబ్బందులు కలిగిస్తాయి. మరికొందరికి పాలు తాగడం వల్ల మొటిమలు, చర్మ సమస్యలు కూడా పెరుగుతాయి.
ఈ సమస్యలను నివారించాలంటే.. పాలకు బదులు పెరుగు, మజ్జిగ వంటివి తీసుకోవచ్చు. ఇవి సులభంగా జీర్ణమవుతాయి. ఉదర సంబంధిత, చర్మ సమస్యలు ఎక్కువగా ఉంటే తప్పకుండా వైద్యుడిని, పోషకాహార నిపుణుడిని సంప్రదించడం మంచిది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు.
Also Read:
తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?
జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?
For More Latest News