Best Time to Take Vitamins: విటమిన్ సప్లిమెంట్స్ ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుంటున్నారా? ఇది తెలుసుకోండి..
ABN , Publish Date - Jan 16 , 2026 | 01:33 PM
విటమిన్ సప్లిమెంట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే విషయం మనందరికీ తెలిసిందే. కానీ వాటిని ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుంటే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: నేటి కాలంలో విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం చాలా సాధారణంగా మారింది. అలసట తగ్గించుకోవడం, బలహీనత పోగొట్టుకోవడం, రోగనిరోధక శక్తి పెంచుకోవడం కోసం చాలా మంది వీటిని వాడుతున్నారు. అయితే, సరైన అవగాహన లేకుండా, ఎప్పుడంటే అప్పుడు సప్లిమెంట్స్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ప్రతి విటమిన్‌కు ప్రత్యేక లక్షణం ఉంటుంది. అవి తీసుకుని.. సమయం, మోతాదు, విధానం సరైనట్లుగా ఉంటేనే శరీరానికి పూర్తి ప్రయోజనం అందుతుంది. కాబట్టి సప్లిమెంట్లను వాడే ముందు వాటి గురించి సరైన సమాచారం తెలుసుకోవడం చాలా అవసరం.
విటమిన్ సప్లిమెంట్స్ ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుంటే శరీరం వాటిని సరిగ్గా గ్రహించదు. దీంతో అవి ఆశించిన ఫలితాన్ని ఇవ్వవు. ఖాళీ కడుపుతో కొన్ని సప్లిమెంట్లు తీసుకుంటే గ్యాస్, అసిడిటీ, కడుపు నొప్పి, వికారం వంటి సమస్యలు రావచ్చు. మరికొన్ని విటమిన్లు ఆహారం తినకుండా తీసుకుంటే ప్రభావం చూపవు. ఎక్కువ మోతాదులో లేదా ఎప్పుడంటే అప్పుడు తీసుకుంటే శరీరంలో విటమిన్లు పేరుకుపోయి తలనొప్పి, వాంతులు, అలసట, నిద్రలేమి వంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కొన్ని సప్లిమెంట్స్ ఇతర మందులతో కలిసి తీసుకుంటే వాటి ప్రభావాన్ని తగ్గించవచ్చు. దీర్ఘకాలంగా ఇలా వాడితే కాలేయం, మూత్రపిండాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే వైద్యుల సలహా లేకుండా విటమిన్ సప్లిమెంట్స్ వాడటం మంచిది కాదు.
సరైన సమయం ఏది?
విటమిన్లు తీసుకునే సమయం వాటి రకాన్ని బట్టి మారుతుంది.
కొన్ని విటమిన్లు ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచిది.
మరికొన్ని భోజనం తర్వాత తీసుకోవాలి.
కొవ్వులో కరిగే విటమిన్లు (A, D, E, K లాంటి వాటిని) భోజనంతో పాటు తీసుకుంటే శరీరం బాగా గ్రహిస్తుంది.
సప్లిమెంట్లను ఎప్పుడూ నీటితో తీసుకోవాలి. సూచించిన మోతాదుకు మించకూడదు. ఇప్పటికే ఇతర మందులు వాడుతున్నవారు తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే సప్లిమెంట్లు తీసుకోవాలి.
జాగ్రత్తలు
డాక్టర్ సలహా లేకుండా సప్లిమెంట్లు తీసుకోవద్దు.
సూచించిన మోతాదుకంటే ఎక్కువ తీసుకోకండి.
ప్రతిరోజూ ఒకే సమయానికి తీసుకునే అలవాటు పెట్టుకోండి.
పిల్లలు, వృద్ధుల విషయంలో ప్రత్యేక జాగ్రత్త వహించండి.
ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు.
Also Read:
తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?
జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?
For More Latest News