Parenting Tips: పసిపిల్లల విషయంలో ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి.!
ABN , Publish Date - Jan 06 , 2026 | 09:18 AM
దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఇది నవజాత శిశువుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందువల్ల, వారి శరీరంలో సంభవించే మార్పులను విస్మరించకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఢిల్లీతో సహా అనేక రాష్ట్రాలు ప్రస్తుతం తీవ్రమైన చలిని ఎదుర్కొంటున్నాయి. ఈ చలి వాతావరణం నవజాత శిశువులకు మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఎందుకంటే, నవజాత శిశువులకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీని వల్ల వారు జలుబుకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే, పసిపిల్లలు తమ సమస్యను చెప్పలేకపోతారు కాబట్టి వారి ప్రవర్తన, శారీరక మార్పులపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం.
నవజాత శిశువుల్లో జలుబు ప్రారంభ లక్షణాలను ముందుగానే గుర్తిస్తే తీవ్రమైన సమస్యలను నివారించవచ్చు. అందువల్ల చిన్నారుల తల్లిదండ్రులు వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. నవజాత శిశువుల్లో జలుబు లక్షణాలను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
నవజాత శిశువుల్లో జలుబు లక్షణాలు ఏంటి?
శిశువు చేతులు, కాళ్లు చల్లగా ఉండటం, చర్మం పాలిపోయినట్టు లేదా కొద్దిగా నీలం రంగులో కనిపించడం వంటి లక్షణాలు ఉండవచ్చు. శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే తక్కువగా ఉండటం కూడా ఒక సూచన. అలాగే, బిడ్డ ఏడుస్తున్నప్పుడు వేగంగా శ్వాస తీసుకోవడం, తరచుగా తుమ్మడం, ముక్కు మూసుకుపోవడం వంటి సమస్యలు కూడా రావచ్చు. మీ బిడ్డకు ఈ లక్షణాల్లో ఏవైనా కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సమయానికి చికిత్స చేయకపోతే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది.
నవజాత శిశువులను ఎలా చూసుకోవాలి?
శీతాకాలంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బిడ్డకు ఎప్పుడూ వెచ్చగా ఉండే దుస్తులు వేయాలి. సమయానికి తల్లిపాలు ఇవ్వడం చాలా ముఖ్యం. ఉదయం స్నానం చేయించిన తర్వాత బిడ్డను కాసేపు ఎండలో కూర్చోనివ్వాలి. ఇది ఆరోగ్యానికి మంచిది. చల్లని గాలి పడకుండా చూడాలి. ఫ్యాన్ లేదా ఏసీకి దూరంగా ఉంచాలి. ఏవైనా ఆరోగ్య సమస్యల లక్షణాలు కనిపిస్తే ఇంట్లో మందులు వేసి సొంత వైద్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతుంది. కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు)
Also Read:
కీరదోసకాయ వీరు అస్సలు తినొద్దు.. ఎందుకంటే..!
కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో కనిపించే సంకేతాలు ఇవే.!
For More Latest News