వేసవిలో కర్బూజతో ఎన్నో లాభాలు.. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
ABN , Publish Date - Mar 16 , 2026 | 03:30 PM
వేసవిలో లభించే కర్బూజ పండు శరీరానికి అద్భుతమైన చలువనిచ్చి, డీహైడ్రేషన్ నుండి కాపాడుతుంది. ఇందులో విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడం, గుండె ఆరోగ్యాన్ని రక్షించడం, బరువు తగ్గడంలో ఇది సహాయపడుతుంది.
ఇంటర్నెట్ డెస్క్: వేసవిలో భానుడు భగభగమంటున్నాడు. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో శరీరం డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సమయంలో ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన వరం ‘కర్బూజ’(Muskmelon). ఇందులో 95% వరకు నీరు, విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడం, గుండె ఆరోగ్యాన్ని రక్షించడం, బరువు తగ్గడంలో ఇది సహాయపడుతుంది.
1.డీహైడ్రేషన్ నుంచి రక్షణ:
ఎండల వల్ల శరీరం త్వరగా నీటిని కోల్పోతుంది. కర్బూజ తినడం, జ్యూస్ చేసుకొని తాగడం వల్ల శరీరానికి అవసరమైన నీరు అంది, రోజంతా ఉత్తేజంగా ఉండటానికి సహాయపడుతుంది.
2. రక్తపోటు నియంత్రణ:
కర్బూజలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచడమే కాకుండా, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
3. జీర్ణక్రియకు మేలు:
ఇందులో పీచు పదార్థం (Fiber) ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను తొలగించి, జీర్ణ వ్యవస్థను శుభ్రంగా ఉంచుతుంది. అసిడిటీ సమస్యతో బాధపడేవారికి ఇది మంచి ఔషధం.
4. కంటి చూపు మెరుగుపరుస్తుంది:
కర్బూజలో ఉండే విటమిన్-A, బీటా కెరోటిన్ కంటి చూపును మెరుగుపరచడంలో తోడ్పడతాయి. వయసు రిత్యా వచ్చే కంటి సమస్యను ఇది నివారిస్తుంది.
5. చర్మ సౌందర్యం:
ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని తాజాగా ఉంచుతాయి. ఇది చర్మంపై ముడతలను తగ్గించి, సహజమైన కాంతిని ఇస్తుంది.
6. బరువు తగ్గడం:
కర్బూజలో క్యాలరీలు చాలా తక్కువ, కానీ ఫైబర్ ఎక్కువ. ఇది తన్న తర్వాత కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. తద్వారా అనవసరమైన ఆహారం తీసుకోకుండా బరువు తగ్గడానికి సహకరిస్తుంది.
7. రోగనిరోధక శక్తి:
ఇందులో ఉండే విటమిన్ - సి శరీరంలోని తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచి, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది.
8. కిడ్నీల ఆరోగ్యం:
కర్బూజలోని ఆక్సిజన్ అనే పదార్థం కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా చూస్తుంది. అలాగే మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది.
9. నిద్రలేమి సమస్య దూరం:
కర్బూజలో ఉండే కొన్ని ప్రత్యేక పోషకాలు నరాలను శాంతపరిచి, ఒత్తిడిని తగ్గించి మంచి నిద్ర పట్టేలా చేస్తాయి.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఆరోగ్య బీమా లేదా అత్యవసర నిధి.. ఏది ముఖ్యం
పెర్ఫ్యూమ్ అవసరం లేకుండా చెమట వాసన పోవాలా? ఈ చిట్కాలు ఫాలో అవండి
For More Latest News