గర్భస్రావం తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ABN , Publish Date - Feb 27 , 2026 | 05:38 PM
గర్భస్రావం తర్వాత మహిళలు కోలుకోవడానికి సమయం పడుతుంది. ఈ సమయంలో నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: గర్భస్రావం తర్వాత మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. ఈ సమయంలో శరీరం తిరిగి కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. సరైన జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా కోలుకోవచ్చు. భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. కానీ నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందువల్ల గర్భస్రావం తర్వాత మహిళలు చేయకూడని తప్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.
గర్భస్రావం తర్వాత చేయకూడని తప్పులు
ఎక్కువ శారీరక శ్రమ చేయకూడదు. ఇది రక్తస్రావాన్ని పెంచే ప్రమాదం ఉంది.
డాక్టర్ సలహా లేకుండా మందులు తీసుకోకూడదు.
వైద్యులు ఇచ్చిన మందులను మధ్యలో ఆపకూడదు.
నొప్పి, జ్వరం, అసాధారణ రక్తస్రావం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు.
పరిశుభ్రతను పాటించకపోవడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.
గర్భస్రావం తర్వాత తీసుకోవాల్సిన ఆహారం
గర్భస్రావం తర్వాత పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఆకుకూరలు, పండ్లు, పప్పుధాన్యాలు తీసుకోవాలి. అలాగే.. పాలు, పెరుగు, ప్రోటీన్, విటమిన్లు ఉన్న ఆహారం తీసుకోవాలి. ఎక్కువగా నీరు తాగాలి. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. మద్యం, ధూమపానం, ఎక్కువ కాఫీ లేదా కెఫిన్ తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. గర్భస్రావం తర్వాత విశ్రాంతి తీసుకోవడం, పోషకాహారం తీసుకోవడం, పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
ఈ వార్తలు కూడా చదవండి:
హమ్మయ్య! గోల్డ్ రేట్ తగ్గిందిగా!
మూడో డిస్కమ్ ఏర్పాటులో మరో కీలక అడుగు
Read Latest News