ఫోన్ చూస్తూ తింటే ఆరోగ్య సమస్యలు తప్పవు
ABN , Publish Date - Feb 26 , 2026 | 06:11 PM
ప్రస్తుతం చిన్నపిల్లల నుండి పెద్దల వరకు భోజనం చేసేటప్పుడు మొబైల్ ఫోన్ చూడటం సాధారణ అలవాటుగా మారింది. అయితే ఈ అలవాటు ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: భోజనం చేసేటప్పుడు మొబైల్ ఫోన్ లేదా టీవీ చూడటం సాధారణ అలవాటుగా మారింది. కానీ ఇలా తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహారాన్ని ఆస్వాదిస్తూ నెమ్మదిగా తినడం ఆరోగ్యానికి ముఖ్యమని చెబుతున్నారు. కానీ చాలా మంది సోషల్ మీడియా రీల్స్, వీడియోలు చూస్తూ తింటున్నారు. ఈ అలవాటు వల్ల శరీరానికి అనేక ఆరోగ్య సమస్యలు రావచ్చు. మొబైల్ చూస్తూ తింటే కలిగే సమస్యలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
ఊబకాయం:
మొబైల్ లేదా టీవీ చూస్తూ తినడం వల్ల మెదడు ఆహారంపై దృష్టి పెట్టక, ఆకలిని గుర్తించలేక అవసరానికి మించి ఎక్కువ తింటారు. ఇది ఊబకాయానికి (Obesity) దారితీస్తుంది. ఈ అలవాటు వల్ల ఆహారాన్ని సరిగ్గా నమలకుండా మింగడం, జీర్ణక్రియ మందగించడం వంటి సమస్యలు వస్తాయి.
జీర్ణ సమస్యలు:
మొబైల్ లేదా టీవీ చూస్తూ తినడం వల్ల అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి తీవ్రమైన జీర్ణ సమస్యలు వస్తాయి. ఇది పరిమితికి మించి తినడం, బరువు పెరగడం, ఆహారాన్ని సరిగ్గా నమలకపోవడం వల్ల పోషకాల లోపానికి దారితీస్తుంది.
డయాబెటిస్ ప్రమాదం:
మొబైల్ లేదా టీవీ చూస్తూ ఎక్కువగా తినడం, బరువు పెరగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇది డయాబెటిస్ వచ్చే అవకాశాన్ని పెంచుతుంది.
తినేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు
భోజనం చేసేటప్పుడు మొబైల్ ఫోన్ లేదా టీవీ చూడకపోవడం మంచిది.
ఆహారం మీదే దృష్టి పెట్టి నెమ్మదిగా తినండి.
ఆహారాన్ని బాగా నమలండి.
భోజనం చేసిన వెంటనే ఎక్కువగా నీరు తాగకుండా కొంత సమయం తర్వాత తాగండి.
ఆరోగ్యంగా ఉండాలంటే చిన్న చిన్న అలవాట్లలో మార్పులు చేయడం చాలా అవసరం. భోజనం చేసే సమయంలో మొబైల్‌కు దూరంగా ఉండటం మంచిది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
యువతలో బీపీ పెరగడానికి కారణం తెలుసా?
పాదాలలో ఈ 4 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!
For More Latest News