Share News

పుచ్చకాయ కొనేటప్పుడు ఈ పొరపాటు అస్సలు చేయకండి!

ABN , Publish Date - Mar 13 , 2026 | 05:17 PM

వేసవి కాలం వచ్చిందంటే అందరికీ గుర్తుకు వచ్చే మొదటి పండు పుచ్చకాయ. పుచ్చకాయలో ఎన్నో రకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయలను తింటే ఎండ వేడిమికి డీహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది. వివరాల్లోకి వెళితే..

పుచ్చకాయ కొనేటప్పుడు ఈ పొరపాటు అస్సలు చేయకండి!
How to Choose Watermelon

ఇంటర్నెడ్ డెస్క్: వేసవి కాలం వచ్చిందంటే అందరికీ గుర్తుకు వచ్చే మొదటి పండు పుచ్చకాయ. పుచ్చకాయలో ఎన్నో రకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయలను తింటే ఎండ వేడిమికి డీహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది. అయితే, మార్కెట్‌కు వెళ్లినప్పుడు వందల కాయల్లో ఏది తీయగా ఉంటుందో, ఏది పాడై పోయిందని కనిపెట్టడం చాలా కష్టం. పుచ్చకాయ‌పైన చూడటానికి ఎర్రగా కనిపించినా, తీరా కోసిన తర్వాత తెల్లగా ఉంటే డబ్బులు వృథా అవుతుంది. అందుకే, పుచ్చకాయ కొనేటప్పుడు ఈ క్రింది విషయాలను తప్పక గమనించండి.


1. మెరుపును చూసి మోసపోకండి. చాలామంది పండు మెరుస్తూ ఉంటే అతి తాజాగా ఉందని అనుకుంటారు. కానీ, పుచ్చకాయ విషయంలో అది తప్పు. బాగా పండిన పుచ్చకాయ మెరుపు లేకుండా ఉంటుంది. కార మెరుస్తోందని అంటే అది ఇంకా పచ్చిగా ఉందని అర్థం.

puchakaya2.jpg2. పుచ్చకాయ నేలపై పడి ఉన్నప్పుడు ఒక వైపు సూర్యరశ్మి తగలదు. ఆ భాగాన్ని ‘ఫీల్డ్ స్పాట్’ అంటారు. ఆ మచ్చ నారింజ-పసుపు రంగులో ఉంటే అది తీయగా ఉందని అర్థం. ఒకవేళ అది తెల్లగా ఉంటే ఆ కాయ ఇంకా పండలేదని అర్థం.

puchaje.jpg3. పుచ్చకాయ తీసుకునేటప్పుడు ఆకారాన్ని గమనించాలి. పాడవుగా ఉన్నవి మగపండు(Male). వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కానీ తీపి తక్కువ. గుండ్రంగా ఉన్నవి ఆడవి(Female). ఇవి చాలా తీయగా ఉంటాయి, మీకు తీపి కావాలంటే గుండ్రటి కాయను తీసుకోండి.

puchakyaka.jpg


4. ఒకే పరిమాణంలో ఉన్న రెండు కాయలను చేతిలోకి తీసుకున్నప్పుడు, ఏది ఎక్కువ బరువు ఉంటే దాన్ని తీసుకోండి. బరువు ఎక్కువగా ఉంటుందంటే అందులో గుజ్జు, రసం సమృద్ధిగా ఉన్నాయని అర్థం.

puchakaya.jpg5. కాయపైన గోధుమ రంగులో నెట్ లాంటి గీతలు కనిపిస్తే.. ఆ పండును అస్సలు వదలకండి. ఆ గీతలు ఎక్కువగా ఉంటే, ఆ పండు అంత తీయగా ఉంటుందని అర్థం. పిందెగా ఉన్నప్పుడు తేనెటీగలు ఎక్కువగా వాలడం వల్ల ఆ గీతలు ఏర్పడతాయి.

puchakya4.jpg6. పుచ్చకాయకు ఉన్న కాడ పచ్చగా ఉంటే అది చెట్టు నుంచి ముందే కోసేశారని అర్థం. అదే కాడ పూర్తిగా ఎండిపోయి ఉంటే, అది చెట్టు మీద సహజంగా పండిందని, తింటే చాలా రుచిగా ఉంటుందని అర్థం.

kada.jpg


ఇవి కూడా చదవండి..

తృణమూల్ కాంగ్రెస్ నేతలకు అపాయింట్‌మెంట్ ఇవ్వని రాష్ట్రపతి

మిడిల్‌ఈస్ట్‌లో హింసకు స్వస్తి పలకండి: ఇరాన్ అధ్యక్షుడు మసౌద్‌తో మోదీ

Updated Date - Mar 13 , 2026 | 05:39 PM