Masala: వంటింట్లో వాడే గరం మసాలాతో ఎంతో ఆరోగ్యం..
ABN , Publish Date - Jan 02 , 2026 | 12:05 PM
భారత దేశంలో దాదాపు ప్రతి ఇంట్లో మసాలాలు తప్పకుండా వాడుతుంటారు. మసాలా వంటలకు అద్భుతమైన రుచితో పాటు ఘుమ ఘుమలాడే సువాసనిస్తుంది. ఈ మసాలా దినుసుల్లో అద్భుతమైన ఆరోగ్యం దాగిఉందని నిపుణులు చెబుతున్నారు.
మనం వంటింట్లో (kitchen) ప్రతిరోజూ వాడే మసాలా దినుసు(Spice)ల్లో ఎంతో ఆరోగ్యం (Health)దాగిఉంది. కేవలం రుచి మాత్రమే కాదు.. ఎలాంటి రోగాలనైనా నయం చేసే ఔషద గుణాలు కలిగి ఉన్నాయి. గరం మసాలాలో వాడే మిరియాలు, లవంగాలు చలికాలంలో కఫాం, దగ్గు, గొంతు నొప్పిని నయం చేస్తాయి. వీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ (Anti-inflammatory) లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలోని మంట, నొప్పిని తొలగిస్తాయి. జిలకర్ర పొడి, దాల్చిన చెక్క, జాజికాయ చక్కెర స్థాయిని నియంత్రిస్థాయి. మసాలాలు ఘాటుగా ఉన్నప్పటికీ మనిషి శరీరంలోని నుంచి చెడు విషాన్ని బయటకు పంపిస్తాయి. రక్తాన్ని శుభ్రపరిచి ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే ఎక్కువ మోతాదులో మసాలాలు వాడితే పైల్స్, గుండెల్లో మంట, కడుపులో వికారం, ఎసిడిటీ వంటి ఇబ్బందులు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు.
దాల్చిన చెక్క(Cinnamon) ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తంలోని చెక్కర స్థాయిలను తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ నియంత్రణతో పాటు మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది. అంతేకాదు అధిక బరువు తగ్గడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనా లను అందిస్తుంది. లవంగాలు(cloves) పంటి నొప్పిని తగ్గిస్తాయి, వాటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల లివర్ ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. యాలకులు (Cardamom)నోటి దుర్వాసన పొగొట్టడమే కాదు, జిర్ణక్రియను మెరుగు పరిచి, బీపీని కంట్రోల్‌లో ఉంచుతాయి. జిలకర్ర (Cumin)తో గ్యాస్, ఎసిడిటీ తగ్గిపోతుం ది. శరీరంలో ఉన్న వ్యర్థాలను బయటకు పంపడానికి ఇది సహాయపడుతుంది. ధనియాలు (Coriander) నానబెట్టిన నీరు తాగితే చాలా మంచిది.
ప్రతిరోజూ ఖాళీ కడుపుతో ఈ నీరు తాగితే ఎన్నో సమస్యలకు గుడ్ బై చెప్పొచ్చు. జీర్ణ సమస్యల నుంచి ఇమ్యూనిటీ పవర్ వరకు ఎన్నో లాభాలు ఉన్నాయి. నల్ల మిరియా లలో(Black Pepper)లో ‘పైపెరిన్’ ఉంటుంది. ఇది కాలేయంలో కొడ్డు పెరగకుండా కాపాడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ పుష్కలంగా ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్ సమస్యను దూరం చేస్తుంది. బరువు తగ్గడానికి తోడ్పడతాయి. దగ్గు, జలుబు, రొంప నుంచి ఉపశమనం కలిగిస్తాయి బిర్యానీ (Bay Leaf) ఆకుతో ఒత్తిడి తగ్గించుకోవచ్చు, గుండె ఆరోగ్యం, కిడ్నీ సమస్యల నివారణకు మేలు చేస్తుంది. అనాస పువ్వు (Star Anise) ఇందులో ఉండే ‘షికీమిక్ యాసిడ్’ వైరల్ ఇన్ఫెక్షన్లు (ఫ్లూ) రాకుండా రక్షణ కల్పిస్తుంది.
Also Read:
న్యూ ఇయర్ పార్టీ.. ఇండియాలో బెస్ట్ బీచ్ డెస్టినేషన్స్ ఏవో తెలుసా?
కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో కనిపించే సంకేతాలు ఇవే.!
( Note: ఈ కథనం ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారం అధారంగా ఇచ్చింది.. ABN దీనిని ధృవీకరించలేదు. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం మంచిది.)