Millets Nutrition: చిరుధాన్యాలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. ఎంటో తెలుసా?
ABN , Publish Date - Jan 07 , 2026 | 06:07 PM
చిరుధాన్యాలు మనం నిత్యం ఉపయోగించే ఆహార ధాన్యాలలో చిన్న గింజలు. ఇవి గడ్డి జాతికి చెందినవి. చిరుధాన్యాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఎన్నో అద్భుతమైన ఔషధాలు ఉన్నాయి.
ప్రస్తుతం మారుతున్న జీవనశైలిలో అనారోగ్యకర ఆహారపు అలవాట్లకు అలవాటుపడ్డారు జనాలు. దీంతో కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. డయాబెటీస్, ఊబకాయం,అధిక రక్తపోటు, కిడ్నీ సంబంధిత వ్యాధులు.. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఏదో ఒక కారణంతో ఆస్పత్రుల్లో తిరగాల్సి వస్తోంది. మనం తినే ఆహారంలో చిరుధాన్యాలు తీసుకుంటే థైరాయిడ్, మూత్రపిండాలు, యూరిక్ యాసిడ్, కాలేయ వ్యాధులు, ప్యాంక్రియాటిక్ వంటి వ్యాధులకు చెక్ పెట్టొచ్చని అంటున్నారు నిపుణులు.
చిరుధాన్యాలతో కలిగే ప్రయోజనాలు:
డయాబెటిస్ కంట్రోల్: చిరుధాన్యాలలో ‘గ్లెసెమిక్ ఇండెక్స్’ తక్కువగా ఉండటం వల్ల ఇవి రక్తంలోని చెక్కర స్థాయిలను పెరగనీయకుండా చూస్తాయి.
అధిక బరువు తగ్గడం: వీటిలో పీచు పదార్థం (Fiber) ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా ఆకలి వేయడం, బరువు తగ్గడం సులభమవుతుంది.
గుండె ఆరోగ్యం: చిరుధాన్యాలలో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల అధిక రక్తపోటు(BP) నియంత్రణలో ఉంటుంది, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
జీర్ణక్రియ: పీచు పదార్థం వల్ల మలబద్ధక సమస్యలు దూరమవుతాయి, జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
గ్లూటెన్ ఫ్రీ: గోధుమలు(Gluten allergy) పడని వారు చిరుధాన్యాల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
ఎలా తీసుకోవాలి:
చిరుధాన్యాలను వండుకునే ముందు కనీసం 6 నుంచి 8 గంటలు నానబెట్టాలి. దీనివల్ల వాటిలో ఉన్న పోషకాలు శరీరానికి బాగా అందుతాయి. చిరుధాన్యాలను అన్నం, రొట్టెలు, ఇడ్లీ, దోశ లేదా గంజిగా కూడా తీసుకోవచ్చు.
చిరుధాన్యాల రకాలు:
కొర్రలు: డయాబెటిస్ ఉన్నవారికి కొర్రలు మంచి ఆహారం. శరీరంలోని కొలెస్ట్రాల్ లేకుండా చూస్తుంది. నరాలకు శక్తినిస్తుంది, మానసికంగా దృఢంగా ఉండేలా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లను పుష్కలంగా ఇస్తాయి.
అరికెలు: రక్తహీనత సమస్య ఉన్నవాళ్లకు అరికెలు ఒక గొప్ప వరం అనే చెప్పాలి. మలబద్ధకం, షుగర్ వంటి సమస్యలతో బాధపడేవారికి అరికెలు రోజూ తింటే ఎంతో ఆరోగ్యం. మంచి నిద్ర పడుతుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
ఊదలు: ఇవి జీర్ణాశయానికి ఎంతో మేలు చేస్తాయి. చిన్న పెగు, పెద్ద పేగుల ఆరోగ్యాన్ని కాపాడతాయి. క్యాన్సర్ వంటి మహమ్మారి దగ్గరకు రాకుండా చూస్తుంది. రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు ఊదలను తమ ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు.
సామలు: అజీర్తి ఉన్నవారికి సామలు ఒక వరం అనే చెప్పొచ్చు. అతిసారం, అజీర్ణం, సుఖవ్యాధులు, అడవారి రుతు సమస్యలకు సామలు మంచి పరిష్కారాన్ని చూపిస్తాయి. మైగ్రెన్ నుంచి త్వరగా ఉపశమనం ఇస్తాయి. గుండె సంబంధిత సమస్యలను పరిష్కరిస్తుంది. ఊబకాయం, కీళ్ల నొప్పులతో బాధపడేవారు సామలు తింటే చక్కటి ఆరోగ్యాన్ని పొందుతారు.
(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతుంది. కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు)
Also Read:
ఆఫీసులో ఈ 4 రకాల వ్యక్తులు ఎక్కువగా నష్టపోతారు..