జిమ్‌కు వెళ్తున్నా బరువు తగ్గడం లేదా?
ABN , Publish Date - Feb 22 , 2026 | 04:52 PM
రోజూ జిమ్‌కు వెళ్లి చెమటలు పట్టేలా కసరత్తులు చేసినా బరువు తగ్గడం లేదా? ఇది చాలా మందిలో కనిపించే సమస్య. జీవక్రియ మందగించడం దీనికి ప్రధాన కారణం కావచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రతిరోజూ జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేసినా బరువు తగ్గడం లేదని కొంతమంది బాధపడుతుంటారు. ఇది సాధారణ విషయం కాదు. దీని వెనుక జీవక్రియ మందగించడం(మెటబాలిక్ రెసిస్టెన్స్) ప్రధాన కారణం కావచ్చు. ఈ పరిస్థితిలో శరీరం క్యాలరీలను సరైన విధంగా ఖర్చు చేయదు. దీని వల్ల బరువు తగ్గడం కష్టమవుతుంది.
జీవక్రియ మందగించినప్పుడు కనిపించే లక్షణాలు
బరువు తగ్గకుండా అదే స్థాయిలో ఉండటం
పొత్తికడుపు వద్ద కొవ్వు పెరగడం
ఎప్పుడూ అలసటగా అనిపించడం
వ్యాయామం చేసిన తర్వాత కూడా శక్తి లేకపోవడం
తీపి పదార్థాలు ఎక్కువగా తినాలనిపించడం
ఉదయం లేవగానే అలసటగా అనిపించడం
బాగా నిద్రపోయినా శక్తి లేకపోవడం
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. జీవక్రియ మందగించడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెర తీసుకోవడం, సరిపడా నిద్రలేకపోవడం, ఎక్కువ ఒత్తిడి ఉండటం, చాలా తక్కువ క్యాలరీల ఆహారం తీసుకోవడం, థైరాయిడ్ వంటి హార్మోన్ సమస్యలు.. శరీరంలో క్యాలరీలు ఖర్చయ్యే ప్రక్రియను తగ్గిస్తాయి.
ఎక్కువసేపు కూర్చునే అలవాటు ఉన్నవారికి, కుటుంబంలో మధుమేహం లేదా ఊబకాయం ఉన్నవారికి, వ్యాయామం చేయనివారికి, క్రమం తప్పకుండా ఆహారం తీసుకోని వారికి.. ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఎలా నివారించాలి?
ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఆహారం తీసుకోవాలి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
రోజూ 7-8 గంటలు నిద్రపోవాలి.
ఒత్తిడిని తగ్గించుకోవాలి.
క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.
జిమ్‌కు వెళ్లినా బరువు తగ్గకపోతే, అది జీవక్రియ మందగించడం వల్ల కావచ్చు. సరైన ఆహారం, వ్యాయామం, నిద్ర, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తే జీవక్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గడం సులభమవుతుంది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
యువతలో బీపీ పెరగడానికి కారణం తెలుసా?
పాదాలలో ఈ 4 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!
For More Latest News