Share News

మహిళలు ప్రొటీన్ పౌడర్‌ను తినొచ్చా?

ABN , Publish Date - Feb 22 , 2026 | 09:29 AM

మహిళలు ప్రొటీన్ పౌడర్‌లు తీసుకోవచ్చా లేదా అనే ప్రశ్నకు ఓ న్యూట్రిషనిస్టు సవివరమైన సమాధానం ఇచ్చారు. ఆమె పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

మహిళలు ప్రొటీన్ పౌడర్‌ను తినొచ్చా?
Protein Powder for Women - Benefits

ఇంటర్నెట్ డెస్క్: ప్రొటీన్ పౌడర్‌లు కేవలం పురుషులకేనా? మహిళలకు అవసరం లేదా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఈ ప్రశ్నకు అనామిక రఘువంశీ అనే న్యూట్రిషనిస్టు సవివరమైన సమాధానం ఇచ్చారు. ఈ విషయమై నెట్టింట ఆమె పంచుకున్న పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది (Protein Powder for Women).

అనామిక తెలిపిన దాని ప్రకారం, ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మాంసకృత్తులు లభించని పక్షంలో మహిళలకు ప్రొటీన్ పౌడర్‌లతో మేలు కలుగుతుంది. అతిగా జుట్టు ఊడిపోతుండటం, ఒంట్లో కొవ్వు పేరుకుపోతుండటం, కసరత్తులతో ఆశించిన ఫలితాలు లేని సందర్భాల్లో మహిళలు ప్రొటీన్ పౌడర్ వైపు మళ్లొచ్చు. రోజుకు 70గ్రాముల కంటే తక్కువగా ప్రొటీన్‌ తీసుకునే మహిళలకు ఈ సప్లిమెంట్స్‌తో మేలు కలుగుతుందని ఆమె పేర్కొన్నారు.


ప్రొటీన్ పౌడర్‌లు తీసుకునేందుకు ప్రత్యేక సమయం, విధానం ఉన్నాయని కూడా అనామిక తెలిపారు. కసరత్తులు చేసొచ్చాక ప్రొటీన్ సప్లిమెంట్స్ తీసుకోవాలని ఆమె సూచించారు. మధ్యాహ్నం వేళ కూడా బూస్టర్‌గా దీన్ని తీసుకోవచ్చని అన్నారు. ఒక చెంచా ప్రొటీన్ పౌడర్‌ను కొబ్బరి నీరు లేదా బాదం పాలల్లో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దీనికి చియా గింజలను జోడిస్తే మరింత మెరుగైన ఫలితం ఉంటుందని కూడా అనామిక పేర్కొన్నారు.

ప్రొటీన్‌ పౌడర్‌ల ఎంపికలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చక్కెరలు, లేదా ఆర్టిఫిషియల్ స్వీట్నర్‌లు, అదనంగా జోడించిన ఇతరత్రా పదార్థాలు ఏమీ లేని ప్రొటీన్ పౌడర్‌లనే ఎంచుకోవాలని సూచించారు. పీసీఓఎస్, ఇన్సులీన్ రెసిస్టెన్స్ వంటి సమస్యలతో బాధపడే మహిళలు ప్రొటీన్‌ పౌడర్‌ను తింటే మేలు కలుగుతుందని అనామిక తెలిపారు.


ఇవి కూడా చదవండి

బీపీ ఏ మేరకు పెరిగితే హార్ట్ ఎటాక్ ముప్పు మొదలవుతుందంటే..

యాంటీబయాటిక్స్ మందులను కోర్సు పూర్తి కాకుండానే ఆపేస్తున్నారా? రిస్క్‌లో పడ్డట్టే..

Read Latest and Health News

Updated Date - Feb 22 , 2026 | 09:43 AM