వేసవి అలసట తగ్గాలంటే ఈ డైట్ ఫాలో అవ్వండి
ABN , Publish Date - Mar 16 , 2026 | 01:42 PM
వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరం త్వరగా అలసిపోవడం, నిర్జలీకరణ సమస్యలు రావడం సాధారణమే. అయితే అలసట, డీహైడ్రేషన్‌ను నివారించేందుకు తినాల్సిన ముఖ్యమైన ఆహారాలు ఏమిటో తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఎండ వేడి కారణంగా శరీరం త్వరగా అలసిపోతుంది. అందుకే ఈ కాలంలో శరీరంలో నీటి శాతం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామంది ఎక్కువగా నీరు తాగితే సరిపోతుందని అనుకుంటారు. కానీ అధిక చెమట కారణంగా నీటితో పాటు ఖనిజాలూ తగ్గిపోతాయి. అందువల్ల నీటితో పాటు కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలను కూడా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
తేలికపాటి ఆహారం తీసుకోవాలి
వేసవిలో ఎక్కువగా వేయించిన, కారంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇవి శరీర ఉష్ణోగ్రతను పెంచి చెమటను ఎక్కువగా వచ్చేలా చేస్తాయి. దీని వల్ల డీహైడ్రేషన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే ఆకుకూరలు, పప్పుధాన్యాలు వంటి తేలికపాటి ఆహారాలను తీసుకోవడం మంచిది.

పెరుగు, మజ్జిగ
రోజువారీ ఆహారంలో పెరుగు, మజ్జిగ లేదా లస్సీ తీసుకుంటే శరీరం చల్లగా ఉండటంతో పాటు అలసట కూడా తగ్గుతుంది.
నిమ్మరసం, కొబ్బరి నీరు
నిమ్మరసం, కొబ్బరి నీరు వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడతాయి. ఇవి శరీరంలోని ఎలక్ట్రోలైట్లను భర్తీ చేస్తాయి. పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు శరీరానికి శక్తిని అందిస్తాయి. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు వీటిని తీసుకోవడం మంచిది.

నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు
పుచ్చకాయ, దోసకాయ, నారింజ, పైనాపిల్ వంటి పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని తరచూ తీసుకుంటే శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. తాజా పండ్ల రసాలు కూడా శరీరానికి శక్తిని అందిస్తాయి.
పుదీనా ఉపయోగించండి
పుదీనా చట్నీ, పుదీనా రసం లేదా డీటాక్స్ పానీయాలు వేసవిలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు శరీరాన్ని తాజాగా ఉంచుతాయి.

కెఫిన్, ఆల్కహాల్ తగ్గించాలి
టీ, కాఫీ, ఆల్కహాల్ వంటి పానీయాలను ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. ఇవి శరీరంలోని నీటి శాతాన్ని తగ్గించి డీహైడ్రేషన్‌కు కారణమవుతాయి.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఆరోగ్య బీమా లేదా అత్యవసర నిధి.. ఏది ముఖ్యం
పెర్ఫ్యూమ్ అవసరం లేకుండా చెమట వాసన పోవాలా? ఈ చిట్కాలు ఫాలో అవండి
For More Latest News