రోగనిరోధక శక్తి పెరగాలంటే.. మీ డైట్‌లో ఇవి తప్పనిసరి!
ABN , Publish Date - Mar 09 , 2026 | 10:12 AM
ప్రస్తుత కాలంలో మారుతున్న వాతావరణం, పెరుగుతున్న ఇన్ఫెక్షన్ల దృష్ట్యా మన శరీరానికి రోగనిరోధక శక్తి (Immunity) బలంగా ఉండటం చాలా ముఖ్యం. ఇమ్యూనిటీ బాగా ఉంటేనే మనం ఏ పనైనా సమర్ధవంతంగా చేయగలం.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత కాలంలో మారుతున్న వాతావరణం, పెరుగుతున్న ఇన్ఫెక్షన్ల దృష్ట్యా మన శరీరానికి రోగనిరోధక శక్తి (Immunity) బలంగా ఉండటం చాలా ముఖ్యం. ఇమ్యూనిటీ బాగా ఉంటేనే మనం ఏ పనైనా సమర్థవంతంగా చేయగలం. మందుల కంటే మనం రోజూ తీసుకునే పోషకాహారమే మనల్ని రోగాల నుంచి కాపాడుతుంది. వ్యాధి నిరోధక వ్యవస్థను పెంచే ఆహార పదార్ధాల గురించి తెలుసుకుందాం.
1. విటమిన్-సి ఉండే పండ్లు:
శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచడంలో విటమిన్-సి కీలక పాత్ర పోషిస్తుంది. ఇవి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి ప్రధాన ఆయుధాలు. రోగనిరోధక శక్తి పెరగడానికి నారింజ, బత్తాయి, నిమ్మ, ఉసిరికాయ తీసుకోవడం మంచిది. ఇవి యాంటీ ఆక్సిడెంట్స్‌గా పనిచేస్తూ కణాల ఆరోగ్యాన్ని కాపాడతాయి.
2. అల్లం, వెల్లుల్లి, పసుపు :
మన వంటింట్లో ఉండే ఈ మూడు పదార్ధాలు అద్భుతమైన ఔషద గుణాలను కలిగి ఉంటాయి. వెల్లుల్లిలో ‘అల్లిసిన్’ ఇన్ఫెక్షన్లను అడ్డుకుంటుంది. అల్లం గొంతు నొప్పి, మంట తగ్గించడంలో తోడ్పడుతుంది. అందుకే చాలా మంది అల్లం టీ చేసుకొని తాగుతుంటారు. ఇక పసుపులోని కర్కుమిన్ అనే పదార్థం శరీరానికి సహజసిద్ధమైన రక్షణ కవచంలా పనిచేస్తుంది.
3. ఆకు కూరలు:
ఆకు కూరల్లో విటమిన్ ఏ, సి పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు మెగ్నీషియం, పొటాషియం వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించటంలో తోడ్పడతాయి. పాలకూరలో విటమిన్-సితో పాటు బీటా కెరోటిన్, అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మన రోగనిరోధక సామర్థ్యాన్ని పెంచుతాయి. ఆకుకూరలను మరీ ఎక్కువ ఉడికించకుండా తీసుకుంటే చాలా మంచిది.
4. పెరుగు, పాలు:
పెరుగులో ఉండే ‘మంచి బ్యాక్టీరియా’ జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, పేగుల్లో వ్యాధి నిరోధక శక్తిని పటిష్టం చేస్తుంది. రోజూ కప్పు పెరుగు తీసుకోవడం వల్ల శరీరానికి చలవతో పాటు రక్షణ కూడా లభిస్తుంది. పాలలో కాల్షియంతో పాటు ప్రొటీన్, విటమిన్ డి, డిటమిన్ ఎ, భాస్వరం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇది ఎముకల బలానికి, దంతాల ఆరోగ్యానికి, కండరాల పనితీరుకు చాలా అవసరం.
5. డ్రై ఫ్రూట్స్, గింజలు:
బాదం, వాల్‌నట్స్ (అక్రూట్), గుమ్మడి గింజలలో విటమిన-ఈ, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను చురుగ్గా ఉంచడంలో సహాయపడతాయి.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకుంటున్నారా? ఇది తెలుసుకోండి
కంటి నొప్పి మెదడు సమస్యకు సంకేతమా?
For More Latest News