Share News

త్వరగా అలసిపోతున్నారా? అసలు కారణం ఇదే!

ABN , Publish Date - Apr 26 , 2026 | 05:35 PM

ఎలాంటి పని చేయకపోయినా అలసటగా అనిపించడం ఈ రోజుల్లో చాలా మందిలో కనిపిస్తున్న సమస్య. దీన్ని సాధారణంగా తీసుకుని పట్టించుకోకపోవడం వల్ల మరింత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

త్వరగా అలసిపోతున్నారా? అసలు కారణం ఇదే!
Constant Fatigue Causes

ఇంటర్నెట్ డెస్క్: ఎలాంటి పని చేయకపోయినా అలసటగా అనిపించడం చాలా మంది అనుభవిస్తున్న సమస్య. దీనిని చిన్న విషయంగా తీసుకోవడం మంచిది కాదు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది శరీరంలో కొన్ని పోషకాల లోపానికి సంకేతం కావచ్చు.


అలసటకు ప్రధాన కారణం

ఎక్కువగా కనిపించే కారణం విటమిన్ లోపం, ముఖ్యంగా విటమిన్ B12 లోపం. ఇది శరీరంలో శక్తి తగ్గడానికి కారణమవుతుంది. ఎప్పుడూ బలహీనంగా అనిపించడం, పనిపై ఆసక్తి తగ్గడం, తల తిరగడం, కండరాల నొప్పులు, ఏకాగ్రత లోపం, చిన్న పనికే అలసిపోవడం, కొంతమందికి మెట్లు ఎక్కేటప్పుడు తల తేలిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం కూడా కనిపించవచ్చు.


విటమిన్ B12 శరీరానికి చాలా అవసరం. ఇది రక్త కణాలు తయారవడానికి, నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. ఈ విటమిన్ లోపం ఉంటే శరీరానికి ఆక్సిజన్ సరఫరా తగ్గి అలసట పెరుగుతుంది. కాబట్టి.. పాలు, పెరుగు, పనీర్, గుడ్లు, చేపలు, మాంసం.. శాకాహారులు ఫోర్టిఫైడ్ ఆహారాలను తీసుకోవచ్చు. అవసరమైతే డాక్టర్ సలహాతో సప్లిమెంట్లు తీసుకోవాలి.

జీవనశైలి కూడా ముఖ్యం:

  • ప్రతిరోజూ కొంత వ్యాయామం చేయాలి.

  • ఒత్తిడిని తగ్గించుకోవాలి.

  • స్క్రీన్ టైమ్ తగ్గించాలి.

  • బాగా నిద్రపోవాలి.

అలసటను చిన్న సమస్యగా తీసుకోకూడదు. ఇది విటమిన్ లోపానికి సంకేతం కావచ్చు. సరైన ఆహారం, మంచి అలవాట్లు పాటిస్తే ఈ సమస్యను తగ్గించవచ్చు. అవసరమైతే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

మటన్ తినడం వల్ల నిజంగా యూరిక్ యాసిడ్ పెరుగుతుందా..

ఇంట్లో కుక్కలను పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా..

For More Latest News

Updated Date - Apr 26 , 2026 | 05:46 PM