Share News

రోజూ నారింజ పండు తినడం వల్ల ఫ్యాటీ లివర్ తగ్గుతుందా?

ABN , Publish Date - Apr 26 , 2026 | 03:28 PM

నారింజ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలిసిందే. అయితే ఇవి ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించడంలో కూడా సహాయపడతాయా అనే సందేహం చాలామందిలో ఉంది.

రోజూ నారింజ పండు తినడం వల్ల ఫ్యాటీ లివర్ తగ్గుతుందా?
Oranges For Fatty Liver

ఇంటర్నెట్ డెస్క్: నారింజ పండ్లు ఆరోగ్యానికి మంచివని అందరికీ తెలిసిందే. వీటిలో విటమిన్ C, ఫైబర్ మంచి మోతాదులో ఉంటాయి. కానీ నారింజ పండ్లు తింటే ఫ్యాటీ లివర్ సమస్య తగ్గుతుందా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఇటీవల ఫ్యాటీ లివర్ సమస్య చాలా మందిలో పెరుగుతోంది. ముఖ్యంగా పట్టణాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. సరైన ఆహారం లేకపోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలి లేకపోవడం దీనికి ప్రధాన కారణాలు.


ఒక పరిశోధన ప్రకారం, 30 నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సు గల 60 మందిపై పరీక్ష చేశారు. వారిలో కొందరికి నాలుగు వారాల పాటు ప్రతిరోజూ సుమారు 400 గ్రాముల గింజలు లేని నారింజ పండ్లు ఇచ్చారు. ఆ తర్వాత వారి ఆరోగ్యాన్ని పరిశీలించగా, కాలేయంలో ఉన్న కొవ్వు కొంత తగ్గినట్టు, కాలేయ ఆరోగ్య సూచికలు మెరుగుపడ్డట్టు గుర్తించారు.


గింజలు లేని నారింజలను “నావెల్ ఆరెంజెస్” అంటారు. ఇవి తీపిగా ఉండి విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా కలిగి ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వును తగ్గించడంలో, ముఖ్యంగా కాలేయం చుట్టూ ఉండే కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి.

ముఖ్యమైన విషయం:

నారింజ పండ్లు కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ కేవలం నారింజలు తింటేనే ఫ్యాటీ లివర్ పూర్తిగా నయం అవుతుందని అనుకోవడం సరైంది కాదు. నారింజ పండ్లు ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా తీసుకుంటే కాలేయానికి మేలు చేస్తాయి. అయితే సరైన ఆహారం, వ్యాయామం, మంచి జీవనశైలి కూడా అవసరం.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

మటన్ తినడం వల్ల నిజంగా యూరిక్ యాసిడ్ పెరుగుతుందా..

ఇంట్లో కుక్కలను పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా..

For More Latest News

Updated Date - Apr 26 , 2026 | 03:29 PM